
సాక్షి, కృష్ణా జిల్లా : ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలిచ్చిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేతో వల్లభనేని వంశీపై శనివారం కేసు నమోదైంది. బాపుల పాడు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనుమాన్ జంక్షన్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా వంశీ, ఆయన అనుచరులు కలిసి పేదలకు నకిలీ పట్టాలు ఇచ్చినట్టు నిర్ధారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తహసీల్దార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment