సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం చేసిన నిందితుడు నాగేశ్వరరావుపై సెక్షన్ 307 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో 4 బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఘటన అనంతరం మంత్రి పేర్నినాని ఇంటి వద్ద భద్రతను పెంచారు. స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. మంత్రిని కలవడానికి వచ్చే ప్రతి ఒక్కరినీ భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. చదవండి: (మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం)
పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు బడుగు నాగేశ్వరరావు
హత్యారాజకీయాలకు తెరలేపారు
మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఘటనను ఖండించాల్సిందిపోయి గుమ్మడికాయల దొంగ మాదిరిగా కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారని మచిలీపట్నం వైస్సార్‌సీపీ అధ్యక్షడు సలార్ దాదా అన్నారు. 'దాడి చేసిన వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడని, నేను అక్రోశంతో ఉన్నానని, పేర్ని నానిని చంపేస్తున్నానని మీకు చెప్పి వచ్చాడా..?ప్రశాంతమైన మచిలీపట్నంలో హత్యా రాజకీయాలకు కొల్లు రవీంద్ర తెర లేపాడు' అంటూ ఫైర్ అయ్యారు. మంత్రి పేర్ని నాని గారిపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొర్రా విఠల్ అన్నారు.
మోకా భాస్కరరావు మాదిరి మట్టు పెట్టాలని చూశారు. కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్‌ను సుమోటోగా తీసుకుని విచారించాలని డిమాండ్ చేశారు. కొల్లు రవీంద్ర హత్యా రాజకీయాలను బందరు ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు తిరస్కరిస్తే 18 నెలల్లో ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని మాజీ కౌన్సిలర్ మేకల సుబ్బన్న తెలిపారు. పోలీసుల విచారణ పూర్తి కాకుండానే ఉనికిని కాపాడుకునేందుకు ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం వెనుక అంతర్యమేమిటీ..?బందరును అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చదవండి: ('మంత్రి పేర్ని నాని కోసం నా ప్రాణాలైనా ఇస్తా')
Comments
Please login to add a commentAdd a comment