Hanuman Junction Police
-
రిటైర్డ్ ఐఏఎస్ పేరుతో జనానికి టోపీ; అరెస్టు
-
రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి అంటూ..
సాక్షి, హనుమాన్ జంక్షన్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి అంటూ వైద్యుల వద్ద నగదు వసూలు చేస్తున్న ఓ మహిళను కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు నిందితురాలిని మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన పెమ్మడి విజయలక్ష్మి(65)అనే మహిళ రిటర్డ్ ఐఏఎస్ అధికారిణి సుజాత రావు పేరు చెప్పి తాను తిరుపతి వెంకన్న దర్శనానికి వెళుతున్నానని డాక్టర్ పేరు మీద తిరుపతిలో గరుడ పూజ చేయిస్తానని 3500 రూపాయిలు నగదు వసూలు చేస్తోంది. ఈ నెల 8వ తేదీన హనుమాన్ జంక్షన్‌లోని సీతా మహాలక్ష్మి నర్శింగ్ హోంకు వెళ్లి పూజ నిమిత్తం 3500 రూపాయిలు ఇవ్వాలని కోరింది. (చదవండి: అగ్నిప్రమాదం : రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే!) అయితే ఆ ఆస్పత్రి వైఎస్సార్ సీపీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు డా: దుట్టా రామ చంద్రరావుది కావడంతో సిబ్బందికి అనుమానం వచ్చి దుట్టా తనయుడు రవి శంకర్‌కు సమాచారం అందించారు. ఐఏఎస్ అధికారిణి సుజాత రావుకు ఫోన్ చేయగా తాను హైదరాబాద్ లో ఉన్నానని చెప్పారు. ఆయన ఆసుపత్రికి వచ్చేసరికి మహిళ అక్కడ నుంచి ఉడాయించడంతో రవిశంకర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విజయలక్ష్మి కోసం గాలింపు చేపట్టారు. గత రాత్రి నకిలీ ఐఏఎస్ ఆచూకీ కనుగొన్న పోలీసులు ఆమెను సోమవారం ఉదయం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే నిందితురాలిని అరెస్టు చేయడంతో హనుమాన్ జంక్షన్ సీఐ రమణ, ఎస్ఐ మదీనా భాష, ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విజయలక్ష్మి గతంలో ఐఏఎస్ అధికారిని సుజాత రావు పేరు చెప్పి నందిగామ, హైదరాబాద్, విజయవాడ, గన్నవరం ఏరియాల్లో నగదు వసూలు చేసినట్లు డిఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. (పోరాడి ఓడింది..!) -
తక్షణ స్పందన.. రాత్రి 11 గంటలకు కేసు నమోదు
సాక్షి, విజయవాడ: అర్ధరాత్రి ఓ మహిళ ఫిర్యాదుపై స్పందించి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులను నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. జీరో ఎఫ్ఐఆర్తో మహిళలకు అదనపు భద్రత లభిస్తుందని అన్నారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితులు యజ్జల దర్బార్ అతని కుమారుడిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. పశ్చిమ గోదావరిలో ఘటన.. తణుకు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేటు బస్సులో మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. పచ్చిమ గోదావరి జిల్లా కలపర్రు వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కృష్ణాజిల్లాలోని హనుమాన్ జంక్షన్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్తో కేసు నమోదు చేశారు. రాత్రి 11 గంటల సమయంలో కేసు రిజిస్టర్ చేయడం విశేషం. నిందితులు పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురంకు చెందిన యజ్జల దర్బార్ అతని కుమారుడిగా గుర్తించారు. -
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
సాక్షి, కృష్ణా జిల్లా : ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలిచ్చిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేతో వల్లభనేని వంశీపై శనివారం కేసు నమోదైంది. బాపుల పాడు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనుమాన్ జంక్షన్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా వంశీ, ఆయన అనుచరులు కలిసి పేదలకు నకిలీ పట్టాలు ఇచ్చినట్టు నిర్ధారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తహసీల్దార్ తెలిపారు. -
పోలీస్‌స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళన
-
నకిలీ మావోయిస్టు అరెస్టు
హనుమాన్‌జంక్షన్(కృష్ణాజిల్లా): విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త పుట్టగుంట సతీశ్‌కుమార్‌ను మావో అగ్రనేత గణపతి పేరుతో బెదిరింపులకు పాల్పడిన నకిలీ మావోయిస్టును హనుమాన్‌జంక్షన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో నూజివీడు డీఎస్పీ జె.సీతారామస్వామి వివరాలు వెల్లడించారు. వీణవంక మండలం కనపర్తికి చెందిన పత్తి శ్రీనివాసరెడ్డి(31)ని మీడియాకు చూపారు. డీఎస్పీ వెల్లడించిన వివరాలు.. మావోయిస్టు అగ్రనేత గణపతి పేరుతో సతీశ్‌కుమార్‌కు ఇటీవల వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయి. పార్టీ ప్లీనరీ కోసం చందాలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడి రెండు బ్యాంక్ ఖాతా నంబర్లు ఇచ్చాడు. దీనిపై సతీశ్‌కుమార్ ఈనెల 22న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వై.వి.రమణ, ఎస్సై ఐ.వి.నాగేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని జమ్మికుంట, వీణవంక ప్రాంతాల నుంచి ఫోన్‌కాల్స్ వెళ్తున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి సీఐ నేతృత్వంలో పోలీసు బృందం జమ్మికుంటకు చేరుకుంది. నిందితుడి ఫోన్‌కాల్స్ జాబితా, బ్యాంక్ ఖాతా నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. జమ్మికుంట ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్‌లో అకౌంటు రిటైర్డ్ పోస్టుమాస్టర్ పేరిట ఉండడంతో జంక్షన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. కనపర్తికి చెందిన శ్రీనివాసరెడ్డి కొన్నిరోజుల కిందట తన ఖాతా నంబరు అడిగితే ఇచ్చినట్లు రిటైర్డ్ పొస్టుమాస్టర్ తెలిపాడు. శ్రీనివాసరెడ్డి ఉపయోగించే సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతాలు తన పేరిట లేకుండా జాగ్రత్త పడ్డాడు. స్నేహితులు, బంధువులు డబ్బులు పంపుతారని చెప్పి ఇరుగుపొరుగు వాళ్ల బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకుని ఈ తరహా బెదిరింపు వసూళ్లకు వాడుకుంటున్నట్లు విచారణలో తేలింది. జిల్లా పోలీసుల సహకారంతో శ్రీనివాసరెడ్డిని జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.