
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, విజయవాడ: అర్ధరాత్రి ఓ మహిళ ఫిర్యాదుపై స్పందించి జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులను నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. జీరో ఎఫ్‌ఐఆర్‌తో మహిళలకు అదనపు భద్రత లభిస్తుందని అన్నారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితులు యజ్జల దర్బార్ అతని కుమారుడిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు.
పశ్చిమ గోదావరిలో ఘటన..
తణుకు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేటు బస్సులో మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. పచ్చిమ గోదావరి జిల్లా కలపర్రు వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కృష్ణాజిల్లాలోని హనుమాన్ జంక్షన్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌తో కేసు నమోదు చేశారు. రాత్రి 11 గంటల సమయంలో కేసు రిజిస్టర్ చేయడం విశేషం. నిందితులు పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురంకు చెందిన యజ్జల దర్బార్ అతని కుమారుడిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment