![Police Complaint Filed Against Hrithik Roshan - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/28/hrithik.jpg.webp?itok=M_xYmivW)
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, చెన్నై : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సహా ఎనిమిది మందిపై చెన్నైలో చీటింగ్ కేసు నమోదైంది. 2014లో హెచ్‌ఆర్‌ఎక్స్ పేరుతో హృతిక్ ప్రారంభించిన బ్రాండ్‌కు స్టాకిస్ట్‌గా తనను నియమించారని, ఆపై తనను రూ 21 లక్షలకు మోసగించారని మురళీధరన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఆయా ఉత్పత్తులను పంపలేదని, తనకు సమాచారం ఇవ్వకుండానే తన సంస్థను మూసివేశారని ఆరోపించారు.
స్టాక్‌ను తిప్పిపంపినా నిందితులు తనకు రావాల్సిన మొత్తం చెల్లించలేదని మురళీధరన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. మురళీధరన్ ఫిర్యాదు ఆధారంగా హృతిక్ రోషన్, మరో ఎనిమిది మందిపై కొడుంగయూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా హృతిక్ రోషన్ ప్రస్తుతం గణిత మేధావి బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న సూపర్ 30 మూవీలో నటిస్తున్నారు. క్వీన్ దర్శకుడు వికాస్ బల్ రూపొందిస్తున్న ఈ మూవీ జనవరి 2019లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment