
సాక్షి, గుంటూరు : ప్రముఖుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నాగరాజు అనే యువకుడు గుంటూరులోని ఓ మొబైల్ షోరూమ్ యజమానికి ఫోన్‌చేసి తాను సీఎం పీఏ అని పరిచయం చేసుకున్నాడు. ఓ క్రికెటర్‌కి రూ.3 లక్షలు స్పాన్సర్ చేయాలంటూ ఆదేశాలు జారీచేశాడు. మరి కొద్దిసేపట్లో ఆ క్రికెటర్ షోరూమ్ దగ్గరకి వస్తాడని తెలిపాడు. కాసేపటి తర్వాత తీరిగ్గా నాగరాజే షోరూమ్‌కు వెళ్లి సీఎం పీఏ పంపించాడంటూ డబ్బులు డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన షోరూమ్ యజమాని అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాగరాజు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తరహాలో చాలా మోసాలకు పాల్పడ్డాడని నిర్ధారణ చేసుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment