ఒక్క ప్రోమోతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్. ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలో ఓ పాటకు ఆమె తన కళ్లతో పలికించిన హావభావాలతో ఒక్కరోజులోనే ఆమె పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమెకు పాపులారిటీ పెరిగిపోవడంతో వరుస అవకాశాలు క్యూ కట్టినట్టుగా వార్తలు వచ్చాయి. ఫిబ్రవరిలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినా ఇంత వరకు సినిమా రిలీజ్ కాలేదు.
ఇన్ని రోజుల వెయిటింగ్ తరువాత ఒరు అదార్ లవ్ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాను 2019 ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇన్నాళ్లు బుల్లితెర మీదే ప్రియా ప్రకాష్‌ను చూసి అభిమానులు త్వరలో వెండితెర మీద చూసేందుకు రెడీ అవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రియా ప్రకాష్‌కు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగుతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment