ప్రియా ప్రకాశ్ వారియర్... ఓ సంవత్సరం కిందట జస్ట్ కాలేజీ అమ్మాయి. ఏడాది తర్వాత పాపులర్ గాళ్. అలా అలవోకగా ప్రియ కన్ను కొట్టడాన్ని నెటిజన్లు కళ్లు పెద్దవి చేసుకుని చూశారు. ఆ విధంగా మలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఆ సినిమాను ‘లవర్స్ డే’ పేరుతో గురురాజ్ తెలుగులో విడుదల చేయనున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రియా ప్రకాశ్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
∙ నేను కేరళ అమ్మాయిని. ప్రస్తుతం బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాను. మా కుటుంబంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లెవరూ లేరు. కానీ చిన్నప్పటినుండి నటి అవ్వాలని మాత్రం ఉండేది. చివరికి అనుకున్నది సాధించాను.
∙‘ఒరు అడార్ లవ్’ టీజర్ చూశాక అందరూ నన్ను ‘వింక్ గాళ్’ అంటున్నారు. అయితే నేను ఏదో ఒక టైటిల్‌తో ఇండస్ట్రీలో నిలబడాలనుకోవడంలేదు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. ‘ఒరు అడార్..’ని పాట చిత్రీకరణతో మొదలుపెట్టాం. అది పూర్తవ్వగానే టీజర్‌లా రిలీజ్ చేశాం. దానివల్లే ఇంత పేరొచ్చింది. సోషల్ మీడియాలో నాకు చాలా క్రేజ్ తీసుకొచ్చింది. సాంగ్ రిలీజయిన తర్వాత మా ఇంట్లో చాలా పెద్ద దుమారమే జరిగింది. చాలామంది ఫ్యాన్స్ మా ఇల్లు కనుక్కొని మా ఇంటికి వచ్చి ప్రియాని చూడాలి అనేవారు. మా నాన్న వాళ్లందరికీ మంచి కథలు చెప్పి మాయ చేసి పంపేవారు. నన్ను కొన్ని
రోజులు హౌస్ అరెస్ట్ చేశారు.
∙ కాలేజీలో నన్నెవరూ టీజ్ చేయలేదు. అందుకని కాలేజ్ మారాల్సిన అవసరం రాలేదు. మాది గాళ్స్ కాలేజ్. ఇప్పటికీ స్టేజ్ షోలు, సింగింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొంటాను. టీచర్స్, స్నేహితులు నన్ను చాలా సపోర్ట్ చేశారు. వాళ్లలో ఏ మార్పూ లేదు. నాకు ఫ్రెండ్స్‌తో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లటం, వాళ్లతో సిటీ బస్‌లో ప్రయాణం చేయడం అంటేæ ఇష్టం.
∙ నేను సినిమా చేయాలంటే ముందుగా కథ వింటాను. నచ్చితే ఆ కథను నాన్నకు చెప్తాను. నాకు చాలా ఆఫర్స్ వచ్చినా ఒక్కటీ చేయలేదు అనుకుంటున్నారు అందరూ. దానికి కారణం మేం ‘ఒరు అడార్..’ని చిన్న సినిమాగా మొదలుపెట్టాం. అందుకే ముందుగా చిన్న బిట్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు మా సినిమా టీమ్. అది హిట్టయి ఇంత పెద్ద పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత మిగతా షూటింగ్ కంప్లీట్ చేయటానికి ఇప్పటివరకు పట్టింది. అంతేకానీ నాకు అవకాశాలు రాక కాదు. నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అంత పెద్ద స్టార్ సినిమాలో ఓ సాంగ్ చేయమని అడిగారు. డేట్స్ కుదరక చేయలేకపోయాను. ఇలా చాలా సినిమాలు మిస్సయ్యాయి. హిందీ ‘సింబా’కి నన్నెవరూ అప్రోచ్ అవ్వలేదు. అవన్నీ రూమర్స్ మాత్రమే.
∙ నేను కేరళ అమ్మాయినైనా నా ఫాలోవర్స్ ఎక్కువ శాతం నార్త్ ఇండియన్స్, హైదరాబాద్ వాళ్లే. చాలా ఇంటరాక్ట్ అవుతారు వాళ్లు. ‘లవర్స్ డే’ క£ý విషయానికొస్తే స్కూల్ డేస్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్ స్టోరీ ఇది. చూసిన ప్రతి ఒక్కరూ రిలేట్ అవుతారు. మీరు వీడియోలో చూసిన ఆ సీన్ ఇద్దరు ఫ్రెండ్స్ చేసే నార్మల్ అల్లరి సీన్. సింగిల్ టేక్‌లో చేసేశాను. మలయాళంలోని ఓ చిన్న సినిమా 4 భాషల్లో రిలీజవ్వటం మలయాళ చిత్రపరిశ్రమలో ఇదే మొదటిసారి. మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున విడుదలవుతుంది.
∙ బాలీవుడ్‌లో చేస్తున్న ‘శ్రీదేవి బంగ్లా’లోని నా పాత్ర వివాదాస్పదమయ్యింది. కారణం ఆ సినిమా ట్రైలర్‌లోని సీన్ దివంగత నటి శ్రీదేవిగారిని పోలి ఉండటమే. సినిమా కథలో భాగం మాత్రమే అది. సినిమా మొత్తం చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. అయితే శ్రీదేవిగారి భర్త బోనీకపూర్ సినిమా నిలిపివేయాలని నోటీసు పంపించారు. కేసు కోర్టులో ఉంది.
∙ విమర్శలు వచ్చినప్పుడు మొదట్లో మనసుకు తీసుకుని ఫీలయ్యేదాన్ని. ఎవరైతే ఆకాశానికి ఎత్తుతారో వారే కింద పడేస్తారు. ఒక సినిమా వయసుతో, ఓ సంవత్సరంలో చాలా విషయాలు నేర్చుకున్నాను.ఈరోజు జరిగే నా సినిమా ఆడియో ఫంక్షన్‌కు అల్లు అర్జున్ రావటం చాలా ఆనందంగా ఉంది. ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నాను. నేను ట్రోల్స్‌ను బాగా ఫాలో అవుతాను. అల్లు అర్జున్ చేసే అన్ని వీడియోలను ఫాలో అవుతాను. అన్నిట్లోకి బన్నీ వాళ్లబ్బాయితో చేసిన వీడియో అంటే ఇష్టం.
Comments
Please login to add a commentAdd a comment