శ్రీదేవికి కళంకం ఆపాదించగలమా! | Priya Prakash Varrier Responds On Controversy Of Sridevi Bangla Movie | Sakshi
Sakshi News home page

శ్రీదేవి చిత్రం బంగ్లా వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాశ్‌

Published Tue, Mar 26 2019 12:30 PM | Last Updated on Tue, Mar 26 2019 12:33 PM

Priya Prakash Varrier Responds On Controversy Of Sridevi Bangla Movie - Sakshi

శ్రీదేవికి కళంకం ఆపాదించాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదంటున్నారు హీరోయిన్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. సినిమాలతో పని లేకుండా ఒక్క కన్ను గీటుతోనే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుంది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. తొలి చిత్రం ఒరు ఆదార్‌ లవ్‌ ట్రైలర్‌తోనే అనూహ్య పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ కేరళ కుట్టి. ఈ చిత్రం విడుదలకు ముందే ప్రియా ప్రకాశ్‌ ఏకంగా బాలీవుడ్‌ చిత్రంలో నటించే అవకాశం అంది పుచ్చుకుంది. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రసాద్‌ మాంపుళ్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీదేవి బంగ్లా చిత్రంలో నటిస్తుంది. అయితే నిర్మాణం పూర్తి కాకముందే ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం.

శ్రీదేవి బంగ్లా చిత్రంలో నటి శ్రీదేవికి సంబంధించిన చర్చనీయాంశ సన్నివేశాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరగడంతో ఆమె కుటుంబసభ్యులు ఇప్పటికే ఈ చిత్రం పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. శ్రీదేవి బంగ్లా చిత్రాన్ని చట్టబద్ధంగా అడ్డుకుంటామని శ్రీదేవి భర్త బోనీకపూర్‌ ప్రకటించారు. ఈ వివాదంపై నటి ప్రియా ప్రకాశ్‌ స్పందిస్తూ ఇటీవల ఒక వీడియోను విడుదల చేసింది. అందులో.. శ్రీదేవి బంగ్లా చిత్రం నటి శ్రీదేవి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్నది కాదని స్పష్టం చేసింది. ఈ చిత్రానికి ఆమెకు ఎలాంటి సబంధం ఉండదని అంది. శ్రీదేవి జీవిత చరిత్రనో, ఆమె మరణం సంఘటనలతోనో చిత్రాన్ని రూపొందించి ఆమె కుటుంబం మనోభావాలను కించపరచాలన్నది తమ అభిమతం కాదని అంది. శ్రీదేవికి కళంకం ఆపాదించాలన్నది తమ ఉద్దేశం కాదని పేర్కొంది.

శ్రీదేవి బంగ్లా పూర్తిగా సాధారణ సస్పెన్స్, థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పింది. అయితే ఈ చిత్ర టైటిల్‌ను నిర్ణయించడం, శ్రీదేవి మరణించడం ఒకే సమయంలో జరగడం యాదృచ్చికమేనని చెప్పింది. అందుకే ఇంత దూమారం చెలరేగుతోందని ప్రియాప్రకాశ్‌ పేర్కొంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement