ప్రియా ప్రకాశ్‌కు భారీ ఆఫర్‌! | Priya Varrier signs To Rs 1 Crore Deal for A National Commercial | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 10 2018 7:19 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Priya Varrier signs To Rs 1 Crore Deal for A National Commercial - Sakshi

మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ రాత్రికి రాత్రే స్టార్‌ అయిన విషయం తెలిసిందే. ప్రియా రూ. కోటి ఆఫర్‌ దక్కించుకున్నారు. ‘ఒరు అదార్‌ లవ్‌’ చిత్రంలో ఓ పాటకు ఆమె తన కళ్లతో పలికించిన హావభావాలతో ఒక్కరోజులోనే ఆమె పాపులర్‌ అయ్యారు. సోషల్‌ మీడియాలో ఆమెకు పాపులారిటీ పెరిగిపోవడంతో ఆఫర్లు వెల్లువెత్తాయి. భారీ పారితోషికం ఇచ్చేందుకు కూడా పలువురు సినీ నిర్మాతలు ముందుకు వచ్చారు.

ఇటీవల ప్రియా ఓ వాణిజ్య ప్రకటన చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఇందు కోసం ఆమెకు కోటి రూపాయల పారితోషికం దక్కినట్టు ప్రచారం జరుగుతోంది. రూ. కోటి డీల్‌పై ఆమె సంతకం చేసినట్లు తెలుస్తోంది. అది జాతీయ ప్రకటన అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షూట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో హాల్‌చల్‌ చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement