‘ఒరు అదార్ లవ్’ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్
ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మత్తుగొలిపే కళ్లతో ముద్దుల తూటాలను పేల్చి యువతకు ఆరాధ్యం అయిపోయిందీ పద్దెనిమిదేళ్ల కేరళ అందం. సోషల్ మీడియాలో‘ఒరు అదార్ లవ్’ సినిమాలోని ఓ రొమాంటిక్ వీడియో క్లిప్ హల్‌చల్ చేయడంతో..రాత్రికి రాత్రే ప్రియా పాపులర్ అయింది. ఈ వీడియో క్లిప్ ఆమెకు కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది.
ఒక్క దెబ్బతో ‘ఒరు అదార్ లవ్’ సినిమా అంచనాలు అమాంతం పెరిగాయి. దాంతో అటు దక్షిణ భారత చిత్ర పరిశ్రమ నిర్మాతలు, ఇటు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ప్రియా కాల్షీట్ల గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. తెలుగులో తాజాగా విడుదలైన ‘ఇగో’ సినిమా నిర్మాతలు తమ తదుపరి సినిమా కోసం ఆమెకు భారీ పారీతోషికం ఆఫర్ చేసినట్టు వినికిడి. చూడాలి మరి తెలుగులోనూ ప్రియ తన కళ్లతో ఏ భావాలు పలికిస్తుందో...!!
Comments
Please login to add a commentAdd a comment