
అమ్మాయి ఓరచూపు చూస్తే వలలో పడని అబ్బాయిలు ఉండరని అంటారు. మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ విషయంలో అది మరోసారి రుజువైంది. కాకపోతే ప్రియా ప్రకాష్ వారియర్ మరో అడుగు ముందుకేశారు. ఆమె కొంటెగా కంటి సైగ చేస్తే రాష్ట్రాల సరిహద్దులు దాటి మరీ యువకులు ఆమె గురించి ఆరా తీశారు. కేవలం 27 సెకన్ల వీడియోతో యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. యువకుల్లో అంతటి క్రేజ్‌ను సంపాదించుకున్న ప్రియా నటించిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో సుఖీభవ సినిమాస్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది.
ఈ సినిమా గురించి తెలుగు నిర్మాతలు ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి మాట్లాడుతూ ‘ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ‘ఒరు ఆధార్ లవ్’ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయక్కర్లేదు. ప్రియా చేసిన ఒక్క కంటి సైగతో ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ అంత గొప్పది. ఆ చిత్రం తెలుగు హక్కుల కోసం చాలా మంది ప్రయత్నించారు. భారీ పోటీ మధ్య హక్కులను మేం దక్కించుకున్నాం. వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగులో లవర్స్ డే అనే పేరుతో విడుదల చేస్తున్నాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment