lovers day
-
నేషనల్ లవర్స్ డే : ఈ అందమైన జంటల్ని చూడండి (ఫోటోలు)
-
స్కూల్‌మేట్స్.. కాలేజీలో ప్రేమ: నేను ఎస్సై.. తను టీచర్
ప్రేమ రెండక్షరాలు.. రెండు హృదయాలు.. ఇద్దరు మనుషులు.. ప్రేమ.. ఒక ధైర్యం.. ఒక సాహసం.. ప్రేమ అనిర్వచనీయం... చూపులు కలిసి.. మనుసులు ఒక్కటై జీవిత భాగస్వాములుగా కలకాలంగా జీవించేందుకు పునాది వేస్తుంది. ఆ జీవన ప్రయాణంలో ఏళ్లు గడిచినా.. ఇంకా కొత్తగానే అనిపిస్తుంది. ఆ మధుర స్మృతులను కలకాలం గుర్తుండేలా చేస్తుంది. ఇలా.. ఉమ్మడి కరీంనగర్‌జిల్లాకు చెందిన పలువురు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. క్లాసురూముల్లో మొదలైన ప్రేమను కలకాలం నిలుపుకుని ఆనందంగా గడుపుతున్నారు. ప్రేమ ఎంత మధురమో.. జీవితంలో స్థిరపడడం అంతే ముఖ్యమంటూ సూచిస్తున్నారు. ప్రస్తుత టీనేజీ యువత ఆకర్షణను ప్రేమ అనుకుంటూ.. జీవితంలో దారి తప్పుతున్నారని పలువురు హెచ్చరిస్తుండగా.. స్వచ్ఛమైన ప్రేమ కలకాలం నిలుస్తుందని మరికొందరు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పలు ఆలయాలు ప్రేమ పెళ్లిళ్లకు వేదికగా నిలవగా.. కొన్ని లవ్స్పాట్స్ వారి స్వీట్ మెమొరీస్‌కు వేదికవుతున్నాయి. నేడు ప్రేమికుల దినోత్సవంగా సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..!! ప్రేమ.. ఉద్యోగం.. పెళ్లి బుగ్గారం: మాది ప్రేమ వివాహం. నేను నా భార్య హరికరెడ్డి ఒకే పాఠశాలలో చదువుకున్నాం. పక్కపక్క గ్రామాలు కావడంతో పరిచయం పెరిగింది. కాలేజీ రోజులలో ప్రేమగా మారింది. పెద్దలకు తెలిసినా జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు. అప్పటికి నేను కానిస్టేబుల్ ఉద్యోగం సాధించా. తను బీఈడీ చదువుతోంది. కొద్దిరోజులకు స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. రెండేళ్లకు నేను ఎస్సైగా ఎంపికయ్యాను. ఇటీవలే పెళ్లిబంధంతో ఒక్కటయ్యాం. ఇప్పుడు ఇద్దరం ఒకే నియోజకవర్గంలో ఉద్యోగాలు చేస్తున్నాం. ప్రేమ ఎంత ముఖ్యమో కెరియర్ అంతే ముఖ్యమని యువత గుర్తించాలి. – శ్రీధర్‌రెడ్డి, ఎస్సై బుగ్గారం, జగిత్యాల జిల్లా శాలపల్లి అబ్బాయి.. నేపాల్ అమ్మాయి. గొల్లపల్లి: జిల్లాలోని పెగడపల్లి మండలం శాలపల్లి గ్రామానికి చెందిన కొండి వెంకటి– లక్ష్మి దంపతుల కొడుకు రవి ఆరేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నాడు. అక్కడే పనిచేసే నేపాల్‌కు చెందిన చంద్రమయ రాయ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్లక్రితం ఇరు కుటుంబాలను ఒప్పించి దుబాయ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఏడాది క్రితం వీరికి కుమారుడు జన్మించాడు. ప్రేమ, అనుబంధాలకు భాష, సరిహద్దులు అడ్డురావని రవి–చంద్రమయ రాయ్ చెబుతున్నారు. డాక్టర్ లవర్స్.. జమ్మికుంట: నా పేరు కన్నవేన తిరుపతి. సొంతూరు జమ్మికుంట మండలం మాచనపల్లి. కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సు చదువున్న సందర్భంలో హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన కె.స్వర్ణలతలో పరిచయం ఏర్పడింది. మొదట స్నేహితులుగా ఉన్నాం. తరువాత ప్రేమగా మారింది. 2015లో పీజీ చదువుతుండగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2017లో వివాహం చేసుకున్నాం. ఇప్పుడు మాకు ముగ్గురు పిల్లలు. 2020 నుంచి జమ్మికుంటలో ఓ ఆస్పత్రి నెలకొల్పి వైద్య సేవలు అందిస్తున్నాం. – కన్నవేన తిరుపతి, జమ్మికుంట అల్గునూర్ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి తిమ్మాపూర్: చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అల్గునూర్ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను పదేళ్లు నిలుపుకుని, పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌కు చెందిన అరుణ్‌కుమార్ ఇంజినీరింగ్ పూర్తిచేసి పైచదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. శ్రీలంకలో డిగ్రీ చదివిన అజ్జూరా.. ఎంబీఏ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. 2014లో ఇద్దరూ పరిచయమయ్యారు. వారిమధ్య ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఆ ప్రేమను పెద్దలు అంగీకరించేందుకు చాలా సమయం పట్టింది. ఆలస్యమైనా పదేళ్లు నిరీక్షించారు. చివరకు తల్లిదండ్రులు వారి ప్రేమలోని నిజాయితీని గుర్తించి అంగీకరించారు. పెద్దల అంగీకారంతో అజ్జూరాతోపాటు ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను తీసుకుని అల్గునూర్‌కు వచ్చాడు అరుణ్‌కుమార్. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో హిందూ వివాహ చట్టం ప్రకారం గత డిసెంబర్లో వివాహంతో ఒక్కటయ్యారు. ఇక జనవరిలో ఈ జంట శ్రీలంక వెళ్లింది. వధువు కుటుంబసభ్యులు బౌద్ధులు కావడంతో అక్కడ ఇద్దరూ మరోమారు బౌద్ధ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. కులాంతర వివాహాల ‘మరిమడ్ల’ కోనరావుపేట(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల ప్రేమాలయంగా వర్ధిల్లుతోంది. ఆ ఊరి జనాభా నాలుగు వేలు. ఆ పల్లెలో దశాబ్దకాలంగా 30 జంటలు ఒక్కటయ్యాయి. కట్నాలు లేకుండా.. ఆదర్శ పెళ్లిళ్లు చేసుకున్నారు. అక్కడ కొట్లాటలు, గొడవలు, ‘పరువు’ హత్యలు కనిపించవు. ఈ ఊరిలో ప్రేమించుకున్న వాళ్లు ధైర్యంగా పెద్దలకు చెప్పి, పెళ్లి చేసుకుంటారు. ప్రభుత్వం జరిపించే కల్యాణమస్తు సామూహిక వివాహ వేదికలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రవికుమార్‌తో ముంబయికి చెందిన రజిత వివాహాన్ని మరిమడ్ల వాసులు దగ్గరుండి జరిపించారు. -
Valentine's Day: ప్రేమిస్తే టీసీ ఇచ్చి పంపించారు..
ప్రేమ..అదో మధురానుభూతి. ఈ భావాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ప్రతి ఒక్కరికీ ఎప్పుడో.. అప్పుడు ఎవరిపైనో మనసులాగేసే ఉంటుంది. ఆ సందర్భంలో మనసులోని వింత అనుభావాలను ఆస్వాధించే ఉంటారు.. ‘ప్రేమించడం కన్నా.. ప్రేమించబడడం అదృష్టం’ అన్నాడో సినీ కవి. అలా దాన్ని చివరి వరకు నిలుపుకుని భాగస్వామి సంతోషమే తమ సంతోషంగా భావిస్తూ కొన్ని జంటలు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నాయి. ప్రేమ..పెళ్లి పీటల వరకు చేరే క్రమంలో ఎన్నో అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా ఒక్కటయ్యారు. ప్రేమలో గెలిచి దంపతులుగా అన్యోన్య జీవనం గడుపుతున్న కొన్ని జంటల జీవితాలను ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ పాఠకుల ముందు ఆవిష్కరిస్తోంది. ప్రియురాలిని ప్రయోజకురాలిగా చేసి.. ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయపల్లికి చెందిన దేవరపల్లి ప్రవీణ్‌రెడ్డి మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడేనికి చెందిన బంధువుల అమ్మాయి భవానిరెడ్డితో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్తా ఇద్దరిలో ప్రేమను చిగురింపజేసింది. అయితే, నిరుపేద కుటుంబానికి చెందిన భవానీరెడ్డి డిగ్రీ మధ్యలో చదువు మానేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న ప్రవీణ్‌రెడ్డి ప్రియురాలిని పీజీ వరకు చదివించాడు. ఆ వెంటనే ఆమెకు వీఆర్వో ఉద్యోగం వచ్చింది. అయినా.. ఆమెను ప్రోత్సహించడంతో 2019లో ఎస్ఐ ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత 2021లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో భవానీరెడ్డి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రవీణ్‌రెడ్డి కూడా హైదరాబాద్‌లో ఎల్ఎల్బీ ప్రాక్టీస్ చేస్తున్నారు. తొమ్మిది నెలల బాబుతో సంతోషంగా జీవిస్తున్నారు. అడ్డంకులను అధిగమించి.. మోత్కూరు : వారిద్దరి మనసులు కలిశాయి. కులా లు అడ్డుగోడలుగా నిలిచినా ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు.. మోత్కూరుకు చెందిన ఎడ్ల శ్రీకాంత్, సముద్రాల సింధూజ దంపతులు. మోత్కూరులో ఫొటోగ్రాఫర్ వృత్తి నేర్చుకుంటున్న శ్రీకాంత్‌కు పట్టణంలోని సముద్రాల వెంకన్న కూతురు సంధ్యతో పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా కాలక్రమంలో ప్రేమగా మారింది. విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో అడ్డంకులు సృష్టించారు. సంధ్యను హైదరాబాద్‌లో బీటెక్ చదివిస్తూ అక్కడే సోదరుడి వద్ద ఉంచారు. శ్రీకాంత్ రెండేళ్ల ఎడబాటు తర్వాత సంధ్యను కలుసుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2018వ సంవత్సరం ఫిబ్రవరి 15న యాదగిరిగుట్టలో సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వ్యతిరేకించి సంధ్య తల్లిదండ్రులు శ్రీకాంత్‌పై కేసు పెట్టినా కోర్టు ప్రేమజంటకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఈ దంపతులు మోత్కూరులో ఫొటో స్టూడియో, ఇంటర్నెట్ సెంటర్ నడుపుకుంటూ తమ ఆరేళ్ల కుమారుడు రెహాన్‡్ష, నాలుగేళ్ల కూతురు శ్రీహన్షతో ఆనందంగా జీవిస్తున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు రామగిరి (నల్లగొండ): మిర్యాలగూడకు చెందిన తుమ్ములూరి మురళీధర్ రెడ్డి హాలియాకు చెందిన పుష్పలత ఇద్దరు బంధువులు. అయినా మొదట్లో వీరికి పరిచయం లేదు. బంధువుల వివాహంలో పుష్పలత తొలిసారిగా మురళీధర్ రెడ్డిని చూసింది. ఆ తర్వాత మురళీధర్ రెడ్డి అడ్రస్ తెలుసుకొని ఉత్తరాలే రాసేది. అవి చూసి తను తెలిసీతెలియక రాస్తుందేమో అనుకునేవాడు. అలా చాలా సార్లు లెటర్లు రాసూ్తనే ఉండేది. అప్పుడు మురళీధర్‌రెడ్డికి అనిపించింది..ఆమె నన్ను నిజంగా ప్రేమిస్తుందని. అప్పటికీ వారి చదువు పూర్తి కాలేదు. ఇంట్లో వాళ్లకు విషయం తెలిసింది. కానీ వారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మురళీధర్ రెడ్డి నల్లగొండలో కంప్యూటర్ హార్డ్‌వేర్‌గా స్థిరపడగా, పుష్పలత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు. అశుతోష్ రెడ్డి ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలో స్థిరపడగా, అమిత్ రెడ్డి డిఫెన్స్ అకాడమీలో పైలెట్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమిస్తే టీసీ ఇచ్చి పంపించారు.. భూదాన్‌పోచంపల్లి : తెలిసీ తెలియని వయస్సులో మైనర్‌ను ప్రేమించాడు. బాలికకు సైతం అతనంటే ఇష్టమే. కానీ తల్లిదండ్రులకు విషయం తెలిస్తే ఏమి అవుతుందోనని భయం. చివరకు ఈ విషయం తెలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్బాయికి టీసీ ఇచ్చి పంపించారు. అయినా పట్టువిడవకుండా అమ్మా యి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. చివరకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని 38 ఏళ్లుగా అన్యోన్య జీవనం సాగిస్తున్న భూదాన్ పోచంపల్లి జెడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి ప్రేమపెళ్లి గా«థ ఇది. భూదాన్‌పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన కోట మల్లారెడ్డి పోచంపల్లి జెడ్పీ హైసూ్కల్లో 9వ తరగతి చదువుతుండగా ఇదే స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సామల పుష్పలతను ప్రేమించాడు. ఈ విషయం పుష్పలత తల్లిదండ్రులు, ఇటు స్కూల్లో ఉపాధ్యాయులకు తెలిసి రచ్చ అయ్యింది. దాంతో మల్లారెడ్డికి ప్రధానోపాధ్యాయుడు టీసీ ఇచ్చి పంపించారు. పెళ్లి చేసుకోవడానికి ఆస్తులు, అంతస్తులు అడ్డు వచ్చి పుష్పలత తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. ఇంటర్ పూర్తి చేసిన నాలుగేళ్ల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి 1989 మే 10న పెళ్లి చేసుకొన్నాడు. ప్రస్తుతం వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పుష్పలత ప్రస్తుతం పోచంపల్లి మండల జెడ్పీటీసీగా ఉన్నారు. కాగా కోట మల్లారెడ్డి ప్రతి ఏటా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున తన సతీమణికి గిఫ్ట్ ఇస్తూ ప్రేమను చాటుతున్నారు. ఒకే ఇంట్లో మూడు ప్రేమ వివాహాలు కోదాడ: తల్లిదండ్రులు కులాలకు అతీతంగా ప్రేమ వివాహం చేసుకోగా.. వారి బాటలోనే వారి ఇద్దరు కుమారులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోదాడ మండల పరిధిలోని కొమరబండకు చెందిన దివ్యాంగుడు కందుల పాపయ్య అదే గ్రామానికి చెందిన వెంకట్రావమ్మను 1980వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెద్ద కుమారుడు కందుల మధు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ తన క్లాస్మేట్ విజయలక్షి్మని 2010లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పాపయ్య చిన్న కుమారుడు కందుల విక్రమ్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ 2014లో తన తోటి ఉద్యోగి ఉషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇలా ఒకే ఇంట్లో ముగ్గురు ప్రేమ వివాహాలు చేసుకొని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఖండాలు దాటి.. ఇంగ్లండ్‌లో చిగురించిన ప్రేమ కోదాడ: ఇండియాలో పుట్టిన వారు ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లారు. అక్కడి యూనివర్సిటీలో కలిసిన మనస్సులు కులమతాలకు అతీతంగా వారిని ఒకటి చేశాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరి నచ్చడంతో వారిమధ్య చిగురించిన ప్రేమ పెళ్లిపీటల వరకు తీసుకెళ్లింది. ప్రస్తుతం వారు ఇద్దరు పిల్లలతో అక్కడే నివాసముంటున్నారు. ప్రేమించడం కన్నా ఆ ప్రేమను నిలుపుకోవడం ముఖ్యమంటున్నారు లంకెల బాలకృష్ణారెడ్డి– నీనశ్రీ దంపతులు. కోదాడకు చెందిన లంకెల బాలకృష్ణారెడ్డి 2007లో ఎంఎస్ చదవడానికి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌కు వెళ్లాడు. ఎంఎస్ కోసం అదే యూనివర్సిటీలో హైదరాబాద్‌కు చెందిన నీనశ్రీ కూడా చేరారు. ఇద్దరు కులాలు వేరైనా అభిప్రాయాలు కలవడంతో వారి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. ఇండియాలో ఉన్న పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరు ఇంగ్లండ్ వారసత్వాన్ని పొందారు. ప్రేమికుల రోజు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమించడం.. ప్రేమించబడడం అదృష్టమని దాన్ని చివరి వరకు నిలుపుకొని భాగస్వామి సంతోషాన్నే తమ సంతోషంగా ఇరువురు భావించినపుడే అ బంధం పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని చెప్పారు. తొలి పరిచయంలోనే ఇష్టపడి.. హుజూర్నగర్ : రెండు భిన్న కులాలకు చెందిన యువతీ, యువకుడి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు వివాహానికి అంగీకరించక పోడంతో రాజకీయ నాయకుల సహాయంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం వర్ధాపురం గ్రామానికి చెందిన బచ్చలకూరి బాబు, శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ప్రవీణ 26 ఏళ్ల క్రితం హుజూర్‌నగర్‌లో తొలి పరిచయంలోనే ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు వివాహానికి అంగీకరించలేదు. దీంతో స్థానిక సీపీఐ నాయకుడు కేవీరాజు సహాయ సహకరాంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. పెద్దమ్మాయి అఖిల అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసింది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికై ఇటీవల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. కాగా చిన్న కూతురు అచ్యుత బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. ప్రస్తుతం వారి కుటుంబం హుజూర్‌నగర్‌లో నివాసం ఉంటోంది. -
Valentine's Day: స్కూల్ డేస్ నుంచే..
నెల్లూరు: ప్రేమ.. అదో మధురమైన అనుభూతి.. ఈ ప్రేమ కొందరి జీవితాల్లో సంతోషాల పంట. యువతీ యువకులు చదువుకునే రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటారు. కొందరు తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే.. మరికొందరు వారిని ఎదిరించి దంపతులవుతారు. ఎలాగైతేనేం నిండునూరేళ్లు ఆనందంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. స్కూల్ డేస్ నుంచే.. నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్దన్‌రెడ్డి కాలనీకి చెందిన పిన్నమిరాజు శివరామప్రసాద్, 53వ డివిజన్ వెంకటేశ్వరపురం ప్రాంతానికి చెందిన కల్పనల మధ్య చదువుకునే రోజుల్లోనే స్నేహం చిగురించింది. కాలేజీ రోజుల్లో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడ్డారు. వీరిద్దరి ప్రేమ విషయం తెలిసిన కల్పన తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో 2006 ఫిబ్రవరి 9వ తేదీన స్నేహితుల సహకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి అరుణ్, హర్ష ఇద్దరు సంతానం. శివరామప్రసాద్ వార్డ్ నం.54, బకాసుర, బుల్లెట్ బాబు తదితర సినిమాల్లో హీరోగా నటిస్తూ వర్దమాన నటుడిగా ఎదుగుతున్నారు. కల్పన నెల్లూరు మెప్మాలో ఆర్పీగా కొనసాగుతున్నారు. వీరి జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ఈ దంపతుల ప్రేమ ప్రయాణం నిండు నూరేళ్లు సాగాలని ఆశిద్దాం. ప్రేమను నిలుపుకున్నాం వీరు ఆత్మకూరు పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ సందాని – షేక్ ముజీబున్నీసా దంపతులు. 30 ఏళ్ల క్రితం సందాని అనంతసాగరం నుంచి ఆత్మకూరుకు చదువుకొనేందుకు వచ్చారు. మెడికల్ ల్యాబ్ శిక్షణ పొంది ఓ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పట్లో ఎల్‌ఆర్‌పల్లిలో నివాసం ఉంటున్న ఆయనకు అదే ప్రాంతానికి చెందిన షేక్ ముజీబున్నీసా పరిచయమయ్యారు. వారి పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల్లో తొలుత అంగీకరించలేదు. ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి 1998లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తున్న వీరు ప్రేమికులకు చెప్పేదేమిటంటే ‘ప్రేమించడం గొప్ప కాదు.. దానిని నిలుపుకోవాలి.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే ఆ కాపురం కలకాలం సంతోషంగా ఉంటుందని’ చెబుతున్నారు. -
‘ప్రామిస్ డే’ అంటే ఏమిటి? వాలంటైన్ వీక్‌లో దీని ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న ‘ప్రామిస్ డే’గా జరుపుకుంటారు. ఇది ప్రేమికుల వారంలో ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతి సంబంధానికి ఈ రోజు ప్రత్యేకమైనదే అయినప్పటికీ, ప్రేమికులకు ‘ప్రామిస్ డే’ ఎంతో ప్రాధాన్యత కలిగినది. ‘ప్రామిస్ డే’నాడు ప్రేమికులు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. బలహీనపడ్డ బంధాలకు తిరిగి ప్రాణం పోయవచ్చు. అయితే మీరు మీ భాగస్వామికి ఎలాంటి ప్రామిస్ చేయలి? ఈ విషయంలో ఎంత నిజాయితీగా వ్యవహరించాలి? అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన అనుబంధాల విషయంలో మీ ఇష్టాలు, అయిష్టాలను అవతలి వ్యక్తిపై ఎట్టిపరిస్థితుల్లోనూ రుద్దకూడదు. అలా కాదని మీకు నచ్చినట్లు వ్యవహరిస్తే క్రమంగా సంబంధం బలహీనపడుతుందని గుర్తించండి. మీరు నిజాయితీగా భాగస్వామిని ప్రేమిస్తే వారు ఎలా ఉన్నారో అలానే అంగీకరించండి. ఈ ప్రామిస్ డే నాడు హృదయ పూర్వకంగా భాగస్వామికి ఇటువంటి వాగ్దానం చేయండి. నాకోసం నువ్వు మారాలని ఏనాడూ కోరనని వాగ్దానం చేయండి. గతంలో ఏమి జరిగినా, వాటిని హృదయపూర్వకంగా అంగీకరించండి. మధురంగా మాట్లాడటం, బహుమతులు ఇవ్వడం ద్వారా ప్రేమికులు పరస్పరం ప్రపోజ్ చేసుకుంటారు. ప్రతి కష్టమైన మలుపులో తోడుగా ఉంటానని చెప్పుకుంటారు. ఈ హామీని ప్రతీ ఒక్కరూ నిలబెట్టుకోలేరు. అయితే దీనిని నిలబెట్టుకోవడంలోనే అసలైన ప్రామిస్‌కు అర్థం ఉంటుంది. అబద్ధం చెప్పే అలవాటు ఉంటే ఎలాంటి సంబంధమైనా కొద్దికాలానికే తెగిపోతుంది. అబద్ధాలు వినడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే వాటిని చాలామంది అలవోకగా మాట్లాడేస్తుంటారు. ప్రామిస్ డే నాడు మీ భాగస్వామితో జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని వాగ్దానం చేయండి. -
బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు సీక్రెట్ మీట్.. తల్లి ఏం చేసిందంటే..
సోషల్ మీడియా అనగానే ఎన్నో వింతలు, విశేషాలు, ఫన్నీ వీడియోలు దర్శనమిస్తాయి. కాగా, సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎంతో మంది లవర్స్‌ను వారి రిలేటివ్స్, పేరెంట్స్ పట్టుకుని చితకబాదిన వీడియోలు చాలానే చూసి ఉంటాం. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఆమె ఇంటిపై రహస్యంగా కలిసింది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లి.. టెర్రస్ మీదకు వచ్చింది. అనంతరం.. టెర్రస్ మీద దాక్కున్న సదరు యువకుడి కోసం గాలించి పట్టుకుంది. బాయ్‌ఫ్రెండ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అతడిని పట్టుకుని చితకబాదుతూ.. చెప్పుతో కొట్టింది. ఇంతలో అతను.. ఆమె చేతిలో నుంచి తప్పించుకుని కిందకు పారిపోయాడు. దీంతో, ఆమె.. పట్టుకోండి వాడిని పట్టుకోండి అంటూ కేకలు వేసింది. తర్వాత, తల్లి తన కూతురు వద్దకు వచ్చి ఆమెను కూడా చితకబాదింది. కూతురు చేసిన పనికి తల్లి.. తన చెప్పుతో కొడుతూ తిట్టింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆంటీ జీ.. మీ కూతురుకు తొందరాగా పెళ్లి చేయండి అని కామెంట్ చేశారు. మరో నెటిజన్.. అర్రే.. వాలెంటెన్స్ డే రోజున ప్రేమికులు దొరికిపోయారే అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. Desi mom catches daughter romancing with boyfriend on terrace, beats them with chappal.pic.twitter.com/AiuTjXTOKJ — RAGHAV (@Raaghav27) February 16, 2023 -
వాలెంటైన్స్ డే స్పెషల్ గిఫ్ట్స్
-
ఫిబ్రవరి 14 మాత్రమే కాదు.. ప్రతి నెల 14 వారికి ప్రేమికుల రోజే! ఎక్కడంటే?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు 'ఫిబ్రవరి 14'వ తేదీనే ఎంచుకుంటారు. ఎందుకంటే ఈ రోజు చరిత్రలో ఎంతో ప్రత్యేకం. నిజమైన ప్రేమకు గుర్తుగా దీన్ని ప్రేమికుల రోజుగా ఏటా జరుపుకొంటారు. అయితే ప్రపంచం మొత్తం ఒక్కరోజే వాలెంటైన్స్ డేను జరుపుకొంటే కొరియాలోని యువత మాత్రం ప్రతి నెల 14వ తేదీని ప్రేమికుల రోజుగానే జరుపుకొంటారు. ఇలా మొత్తం ఏడాదిలో 12 రోజులు తమ ప్రియమైన వారికి కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. మరి ఆ 12 రోజుల ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం... డైరీ డే (జనవరి 14) దక్షిణ కొరియాలో జనవరి 14ను 'డైరీ డే'గా జరుపుకొంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు, స్నేహితులు, ఈరోజున కొత్త డైరీలను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త ఏడాది తర్వాత డైరీ డే రావడంతో వ్యాపారులు కూడా ఆకర్షణీయంగా వీటిని రూపొందించి విక్రయిస్తారు. మరొకొందరు ఈ రోజును 'క్యాండిల్ డే'గా జరుపుకొంటారు. అలంకరించిన క్యాండిల్స్‌ను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) ప్రపంచంలోని అన్ని దేశాల్లాగే ఈ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకొంటారు కొరియా యువత. అయితే వీళ్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రోజు అమ్మాయిలు మాత్రమే అబ్బాయిలకు చాక్లెట్లను కానుకగా ఇస్తుంటారు. అబ్బాయిలు రిటర్న్ గిఫ్ట్‌గా ఏమీ ఇవ్వకూడదు. ఇది వీళ్ల సాంప్రదాయంగా కొనసాగుతోంది. అందుకే కొరియా వ్యాపారులు ఈరోజు రకరకాల చాక్లెట్లను ప్రదర్శిస్తూ యువతను ఆకర్షిస్తుంటారు. వైట్ డే (మార్చి 14) వాలెంటైన్స్ డే తర్వాత వచ్చే 'వైట్ డే' కొరియాలో చాలా స్పెషల్. ప్రేమికుల రోజు తమ ప్రేయసి నుంచి చాక్లెట్లు కానుకగా అందుకున్న అబ్బాయిలు.. వైట్ డే రోజు వాళ్లకు రిటర్న్ గిఫ్టులు ఇస్తారు. తెల్లరంగు చాక్లెట్లనే ఇవ్వడం వల్ల ఈ రోజుకు వైట్ డే అని పేరు పెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో తెల్లరంగుతో పాటు నల్లరంగు చాక్లెట్లను కూడా రిటర్న్ గిఫ్టులుగా ఇవ్వడం అలవాటైంది. అయితే అమ్మాయిలు వాలెంటైన్స్ డే రోజు ఒక్క చాక్లెట్ గిఫ్ట్‌గా ఇస్తే.. అబ్బాయిలు మాత్రం రిటర్న్‌గా మూడు గిఫ్టులు ఇస్తారు. వైట్ చాక్లెట్‌తో పాటు క్యాండీస్, లాలీపప్లను కలిపి ఇస్తుంటారు. బ్లాక్ డే (ఏప్రిల్ 14) వాలెంటైన్స్ డే, వైట్ డే రోజున ఎలాంటి కానుకలు రాని యువత బ్లాక్ డేను జరపుకొంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది సింగిల్స్ డే. తమకు ప్రేమ ప్రపోజల్ రాని యువతీయువకులు ఈ రోజు కలిసి బ్లాక్ నూడుల్స్ తింటారు. సింగిల్స్ మీటింగ్‌గా చెప్పుకునే బ్లాక్ డే రోజున తమను ప్రేమించేవారు లేరని యువత కాస్త ఒత్తిడికి గురవుతారు. ఎల్లో డే (మే 14) ఈ రోజున ప్రేమికులు, దంపతులు పుసుపు రంగు పూలను ఇచ్చిపుచ్చుకుంటారు. తమ ప్రియమైన వారితో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేస్తారు. ఈ రోజు ఎక్కువ సమయం వారికి కేటాయిస్తారు. కిస్ డే (జూన్ 14) కొరియన్ల ఫేవరెట్ డే ఇది. తమ గాఢమైన ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమికులు, భార్యాభర్తలు ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటారు. జంటలకు ఇది బెస్ట్ రొమాంటిక్ డే అని చెప్పుకుంటారు. సిల్వర్ డే (జులై 14) ఈ రోజున ప్రేమికులు ఉంగరాలు మార్చుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే నిశ్చితార్థంలా అనమాట. జీవితాంతం కలిసి ఉంటామని ఇద్దరు ప్రామిస్ చేసుకుని రింగ్స్ మార్చుకుంటారు. గ్రీన్ డే (ఆగస్టు 15) ఈ రోజున ప్రేమికులు, దంపతులు అందమైన పశ్చికబయళ్లు ఉంటే ప్రదేశాలను సందర్శిస్తుంటారు. అక్కడే భోజనం చేస్తుంటారు. వీలైతే ఆకుపచ్చరంగు దుస్తులు ధరిస్తారు. ఈ రోజు ఫ్యామిలీస్ ఎక్కువగా పార్కులకు వెళ్లి ఆనందంగా గడుపుతారు. ఫొటో డే (సెప్టెంబర్ 14) ఈరోజున ప్రేమికులు, స్నేహితులు, ఫ్యామిలీస్ ప్రత్యేకంగా ఫొటోలు దిగుతారు. సెల్ఫీలతో పాటు స్టూడియోలకు వెళ్లి ఫొటో షూట్లు నిర్వహిస్తారు. తమ జీవితంలో ఈ రోజు ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చూసుకుంటారు. వైన్ డే (అక్టోబర్ 14) ఇది వైన్ ప్రియులకు ఇష్టమైన రోజు. ప్రేమికులు, దంపతులు వైన్ డే రోజున ప్రత్యేక పార్టీలు చేసుకుంటారు. స్నేహితులు, కుటంబసభ్యులతో కలిసి బార్లకు, పార్టీలకు వెళ్లి ఇష్టమైన వైన్ తాగుతారు. మూవీ డే (నవంబర్ 14) కొరియన్లకు ఇది కూడా చాలా ఇష్టమైన రోజు. తమ ప్రియమైన వారిని సినిమా హాళ్లలో కలుస్తారు. కొత్త సినిమాలు చూస్తారు. మరికొందరేమో ఇళ్లలోనే డీవీడీలు అద్దెకు తెచ్చుకుని పాప్‌కార్న్ తింటూ మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తారు. హగ్ డే (డిసెంబర్ 14) ఈ రోజున కొరియన్ ప్రజలు తమకు ఇష్టమైన వారిని ఆలింగనం చేసుకుంటారు. ప్రేమికులు ఎక్కడున్నా ఈరోజు కలుసుకొని హగ్ ఇస్తుంటారు. సింగిల్స్ అయితే తమ ఇంట్లో వాళ్లని, స్నేహితులను ఆలింగనం చేసుకుంటారు. ఏడాదికి 12 రోజులు ఇలా ప్రత్యేకంగా జరుపుకొన్నా.. వాలెంటైన్స్ డే, వైట్ డే రోజుల్లో మాత్రం సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రోజులు వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి. చదవండి: ప్రేమ కానుక.. మనసు దోచెనిక.. ప్రేమికుల రోజు ఇచ్చే గిఫ్ట్‌లు ఇవే..! -
Valentines Day 2023: ప్రేమికుల రోజు ఇచ్చే గిఫ్ట్‌లు ఇవే..!
కరీంనగర్: ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు.. ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేసే సందర్భం. ప్రేమలో ఉన్నవారు ఆరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తమ మనసులో మాట చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. మదిలో ప్రేమ సందేశాలను ఇచ్చిపుచ్చుకునేందుకు మార్కెట్లో ఎన్నో వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. కేక్‌లు ప్రత్యేక డిజైన్లలో ఆకట్టుకుంటున్నాయి. ఆయా దుకాణాలు యువతీ యువకులతో కళకళలాడుతున్నాయి. వారు మెచ్చిన, నచ్చిన ఫొటోలు ఫ్రేమ్‌లో బంధించి ఇవ్వడంతోపాటు లవర్స్ స్పెషల్ కీచైన్లు, టుడే అండ్ టుమారో, జస్ట్ ఫర్ యూ అనే హార్ట్ పిల్లోస్‌పై ఆసక్తి చూపుతున్నారు. అలాగే ప్రేమికుల కోసం ఎన్నో రకాల విదేశీ చాక్లెట్లు నోరూరిస్తున్నాయి. గతంలో కంటే ఈసారి వెరైటీ గిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. ముఖ్యంగా చైనా క్రిస్టల్‌తో తయారైన ఉత్పత్తులు యువతను ఆకర్షిస్తున్నాయి. ఇష్టమైన వారి ప్రేమను పొందేందుకు కానుకలు మంచి సాధనాలుగా పని చేస్తాయని నమ్మేవాళ్లు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఏటా ఒక బహుమతి ఇస్తా మాది ప్రేమ వివాహం. ఏటా ప్రేమికుల దినోత్సవం రోజు తప్పనిసరిగా మా వారికి ఏదో ఒక బహుమతి ఇస్తా. ఈసారి అది ప్రత్యేకంగా ఉండాలని షాపింగ్ చేస్తున్నా. ప్రేమ జీవితంలో భాగం కావాలి. – తాటి అమల పవన్, సవరన్ స్ట్రీట్ అందుబాటులో లవ్ గిఫ్ట్స్.. ఈసారి మా స్టోర్‌లో రూ.100 నుంచి రూ.2 వేల విలువైన లవ్ గిఫ్ట్స్ అందుబాటులో ఉంచాం. ప్రేమికులు రేటు ఆలోచించకుండా అందమైన బహుమతులు కొనుగోలు చేస్తున్నారు. – ఈశ్వర్, గణేశ్ జనరల్ స్టోర్, శాస్త్రీరోడ్ ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలి బహుమతుల కన్నా ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటే అది జీవితాంతం చెదిరిపోకుండా ఉంటుంది. నాకు కాబో యే శ్రీవారి కోసం ఈ సంవత్సరం ప్రత్యేక బహుమతి కొనుగోలు చేసి, పంపిస్తున్నాను. – ఉపాధ్యాయుల రుత్విక, సాఫ్ట్వేర్ ఉద్యోగిని, మంకమ్మతోట లవ్ సింబల్స్ ఉన్నవే ఎక్కువ.. లవ్ సింబల్స్ ఉన్న వస్తువులు, బొమ్మల విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో మంచి కొటేషన్లతో గ్రీటింగ్ కార్డులు వచ్చేవి. ఇప్పుడు రావడం లేదు. ఇంటర్నెట్ నుంచి తీసుకొని, ఇచ్చుకుంటున్నారు. – ఉప్పుగల్ల మురళీకష్ణ, వాణిశ్రీ బుక్స్, స్టేషనరీ, 7హిల్స్ చదవండి: ఏకకాలంలో ఒక్కటైన 220 జంటలు -
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కాదు.. 'కౌ హగ్ డే'..!
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు అని అందరికీ తెలుసు. యువతీ, యువకులు తాము ప్రేమించిన వారికి ఈరోజే ప్రపోజ్ చేస్తుంటారు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వాములకు ప్రత్యేక కానుకలు ఇచ్చి సర్ఫ్రైజ్ చేస్తుంటారు. భారతీయ యువతలో ఈ ఆలోచనను మార్చాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ భావిస్తోంది. పాశ్చాత్య దేశాల పట్ల ప్రభావితమై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతున్న యువతలో మార్పు తీసుకురావాలనుకుంటోంది. అందుకే ఫిబ్రవరి 14ను 'కౌ హగ్ డే'గా జరుపుకొని గోవులను ఆలింగనం చేసుకోవాలని పిలుపునిచ్చింది. 'భారతీయ సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవులు వెన్నెముక. పశుసంపదకు, జీవ వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మానవాళికి సకల సంపదలను అందించే తల్లి వంటి పోషకాహార స్వభావం ఉన్నందున ఆవును కామధేను, గోమాత అని పిలుస్తారు. గోవును ఆలింగనం చేసుకుంటే మానసిక ఆనందం కలుగుతుంది. అందుకే ఫిబ్రవరి 14 కౌ హగ్ డే జరుపుకోండి' అని పేర్కొంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ సూచన మేరకు ఆ శాఖ కార్యదర్శి ఈ ప్రకటన విడుదల చేశారు. చదవండి: పార్లమెంట్లో విపక్షాలను ఏకిపారేసిన మోదీ.. -
Valentines Day Special: హ్యాపీ వాలెంటైన్స్ డే
-
వాలెంటైన్ డే : హత్యలెందుకు..?
సాక్షి, హైదరాబాద్ : సృష్టిలో స్నేహం, ప్రేమ అనేవి ఎంతో అద్భుతమైనవి, అందమైనవి, తీయనైనవిగా కలకాలం నిలిచిపోతున్నాయి. ప్రేమ, స్నేహ భావం అనేవి జీవితంలోని అన్నిటా ఎల్లప్పుడూ, ఏదో ఒకరూపంలో స్పృశిస్తూనే ఉంటాయి. ప్రస్తుత డిజిటల్ విప్లవ కాలంలో, సోషల్ మీడియా క్రేజ్, హవా విపరీతంగా పెరిగిపోయిన ఇప్పటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుగా (‘వాలెంటైన్ డే’) అంతర్జాతీయంగా ఎక్కడాలేని ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏర్ప డ్డాయి. వాలెంటైన్ డే అనేది ప్రేమికులకు మాత్రమే పరిమితమైంది కాదు. కుటుంబసభ్యులు, మిత్రులు, సహచరుల మధ్య పరస్పర స్నేహం, మిత్రుత్వం, అనుబంధం, ఆరాధన, గౌరవభావాలు చాటుకునేందుకు ఉద్దేశించినదే ఈ రోజు. హత్యలకెందుకు దారితీసున్నాయి? ఏ స్నేహమైనా, ప్రేమ అయినా ఏదో ఒక ఆకర్షణతో మొదలవుతుంది. అపోజిట్ సెక్స్ అట్రాక్షన్ అనేది సహజ పరిణామం. అది సినిమాల వల్ల, పాటల వల్ల, రకరకాల పరిస్థితుల ప్రభావం వల్ల ఏర్పడొచ్చు. ఆ ఆకర్షణ మధ్యలో ఏదో ఒక కారణం వల్ల తెగిపోతే, అందులో ఒకరు చాలా తీవ్రమైన ఆకర్షణలో ఉంటే. ఆ వ్యక్తి ఆకర్షణ తక్కువగా ఉన్న వ్యక్తి నిర్లక్ష్యాన్ని, పట్టించుకోనితత్వాన్ని అంగీకరించకుంటే, ఒప్పుకోకుంటే.. అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. మనిషి మృగంగా మారుతాడు. మోథేస్ అనే సైకాలజిస్ట్ పరిశోధనలో తేలిందేమంటే.. ప్రేమను కాపాడుకునేందుకు పుట్టేది అసూయ. ఇది ప్రేమ చేజారుతుందేమో అన్నప్పుడు కాకుండా, తన ప్రేమ మరో అబ్బాయికి దగ్గరవుతున్నప్పుడు అసూయ పెరుగుతుంది. ప్రేమ వల్ల కలిగే అనుభూతి బాగుంటుంది. కానీ ప్రేమను కోల్పోవడం జీవితాంతం మరిచిపోలేని బాధను మిగులుస్తుంది. ఇది మెదడులోని ‘సెరటోనిన్’ మాయజాలం. ప్రేమలో ఉన్నప్పుడు ఇది ఒక రివార్డు మెకానిజంలో సంతోషాన్ని కలిగిస్తుంది. అదే ప్రేమ విఫలమైనప్పుడు రివార్డ్ సైకిల్ తెగిపోతుంది. అప్పుడు ఆవేశం, కోపంతో ఊగిపోతారు. ఈ కొత్త పరిస్థితికి ఎలా అలవాటుపడాలో తెలియక భౌతికహింస లేదా దాడులకు పాల్పడుతారు. స్త్రీపై తనకున్న అధికారం, నియంత్రణ కోల్పోవడం అనేది నిస్సహాయతను, ఉక్రోషానికి, ఆవేశానికి కారణమై అందుకు కారణమైన వారిని అంతమొందించే ప్రయత్నం చేస్తారు. ప్రేమ ఓ పద్మవ్యూహం ‘ప్రేమ అనేది ఇప్పుడున్న అవగాహన ప్రకారం ఓ పద్మవ్యూహం. ఇందులో అర్జునులు, ద్రోణాచార్యులు చాలా తక్కువ. కానీ అభిమన్యులే ఎక్కువగా ఉంటున్నారు. తనతో ప్రేమలో ఉన్న అమ్మాయి మరొకరి ప్రేమలో పడి వెళ్లిపోవడం సదరు ప్రేమికుడిని తీవ్ర మానసికవేదనకు, తిరస్కారం వల్ల ఎదురయ్యే తీరని బాధకు దారితీస్తుంది. తన ప్రేమను అమ్మాయి తిరస్కరించడం కొంతమేరకు తట్టుకోగలిగినదైనా, మరొకరి చెంతకు చేరడం తట్టుకోలేనంత బాధను కలిగిస్తుంది. ఎవరైనా ఏదైనా రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టే ముందు చాలా అంశాల గురించి ఆలోచించాలి. అబ్బాయి, అమ్మాయి పరస్పరం ప్రేమించుకోవడానికి ముందే వారిద్దరి భావాలు, అభిప్రాయాలు కలుస్తాయా, అవగాహన కుదురుతుందా లేదా.. ఇళ్లలో వారి ప్రేమను అంగీకరించకపోయినా ఎదురయ్యే పరిణామాలను ధైర్యంగా ఎదుర్కోగలరా.. అన్న విషయాలపై ఆలోచించుకోవాలి. కొంతకాలం ప్రేమ కొనసాగించాక అభిరుచులు, అభిప్రాయాల్లో తేడాలొస్తే ఎదుటి వ్యక్తి సరైన వారు కాదని రిలేషన్షిప్ నుంచి దూరం జరగడంతో సమస్య మొదలవుతుంది. ప్రేమ తిరస్కరణను భరించలేక భౌతికదాడులు, హత్యల దాకా పరిస్థితులు దారితీస్తున్నాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ í -
ప్రేమికుల రోజున ఏయ్ పిల్లా..
‘ఏయ్ పిల్లా..’ అంటూ ప్రేమగీతాలాపన చేశారు నాగచైతన్య. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరి’. ఎమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్‌దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాలోని ‘ఏయ్ పిల్లా..’ అనే పాట మ్యూజికల్ ప్రివ్యూను నిమిషం నిడివితో ప్రేమికుల రోజు సందర్భంగా రేపు ఉదయం 11గం టల 07 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్కూల్‌కి చెందిన పవన్ సి.హెచ్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు భాస్కర్ కటకం శెట్టి సహ–నిర్మాత. ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి.కుమార్. -
దర్శకుడిగా మారిన విలన్!
సీనియర్ నటుడు సత్యప్రకాష్ పేరు చెప్పగానే ‘పోలీస్ స్టోరీ’ సినిమా గుర్తుకొస్తుంది. ఈ ఒక్క సినిమా అనే కాదు, ఎన్నో ఎన్నెన్నో సూపర్ హిట్ సినిమాల్లో ప్రతినాయకుడిగానూ, ముఖ్య పాత్రధారిగానూ రాణించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. 11 భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించిన ఈ సీనియర్ నటుడు తొలిసారిగా మెగాఫోన్ చేతబట్టారు. సత్యప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పేరు ‘ఉల్లాలా ఉల్లాలా’. గత వాలంటైన్స్ డేకి భారీ ఎత్తున ‘లవర్స్ డే’ చిత్రాన్ని విడుదల చేసి మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుఖీభవ మూవీస్ అధినేత ఎ.గురురాజ్ `ఉల్లాలా ఉల్లాలా` చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ ‘తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ, పంజాబీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 500కు పైగా సినిమాల్లో నటించాను. ‘పోలీస్ స్టోరీ’, ‘సీతారామరాజు’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘సమర సింహారెడ్డి’, ‘మాస్టర్’, ‘డేంజర్’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘బిగ్ బాస్’ తదితర చిత్రాలు నాకెంతగానో పేరు తెచ్చిపెట్టాయి. ఇన్నేళ్ల కెరీర్లో నటుడిగా పూర్తిస్థాయి సంతృప్తితో ఉన్నాను. దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్. ఈ సినిమాలో చాలా వింతలూ విశేషాలూ ఉన్నాయి. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ సినిమా ఉంటుంది. మేకింగ్ పరంగా కూడా చాలా కొత్తగా ఉంటుంది. దర్శకునిగా నా తొలి చిత్రానికి గురురాజ్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’ అని అన్నారు. నటరాజ్, నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. -
ఆ ఫొటో కావాలి!
‘‘లవర్స్ డే’ చిత్రం విడుదలయ్యాక ఇక్కడ కూడా నన్ను గుర్తుపడుతున్నారు. ఒక కొత్త నటిగా నాకు సంతోషంగా ఉంది’’ అన్నారు కేరళ కుట్టి నూరిన్ షరీఫ్. ఒమర్ లులు దర్శకత్వంలో రోషన్ అబ్దుల్, ప్రియా ప్రకాష్ వారియర్, నూరిన్ షరీఫ్ ముఖ్యతారలుగా రూపొందిన మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’. ఈ చిత్రం ‘లవర్స్ డే’గా తెలుగులో ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా నూరిన్ మాట్లాడుతూ– ‘‘నిజానికి ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నా పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది. ప్రియా ప్రకాష్ వింక్ ఎపిసోడ్, స్క్రిప్ట్ కొంచెం మారడం వంటి అంశాల వల్ల నా పాత్ర నిడివి తగ్గింది. దాంతో బాధ అనిపించింది. ప్రియా ప్రకాష్‌తో నాకు గొడవలు ఏం లేవు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేసిన నిర్మాత గురురాజ్ బాగా హెల్ప్ చేశారు. ప్రేక్షకుల అభిరుచి మేరకు క్లైమాక్స్‌ను మార్చడం మంచి నిర్ణయమే అనిపించింది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు అల్లు అర్జున్‌గారి సినిమాలను టీవీలో చూశాను. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ‘లవర్స్ డే’ వేడుకకు ఆయన అతిథిగా రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయనతో ఓ ఫొటో దిగాను. ఆయన నన్ను చూసి నవ్వారు. ఆ స్మైల్ చాలు నాకు. ఆ ఫొటో ఎవరు తీశారో తెలుసుకుని తీసుకోవాలని ఉంది. ఒమర్ లులు దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు నూరిన్ షరీఫ్. -
ఒక్కటవుతున్నాం
శుభవార్తను పంచుకోవడానికి వేలంటైన్స్ డేను సందర్భంగా చేసుకున్నారు తమిళ నటుడు ఆర్య, నటి సాయేషా. ఈ జంట ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్త కొన్నిరోజులుగా ప్రచారంలో ఉంది. ఆర్య, సాయేషా మాత్రం ఆ వార్తకు ‘ఊ’ అనలేదు ‘ఊహూ’ అని కూడా అనలేదు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘మేం ఒక్కటవుతున్నాం’ అని ప్రకటించారు. ‘‘మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో మేం పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మార్చిలో పెళ్లి. మా సరికొత్త ప్రయాణంలో మీ ప్రేమ, అభిమానంతోపాటు ఆశీర్వాదాలను కూడా కోరుకుంటున్నాం’’ అని ఓ లేఖలో ఆర్య, సాయేషా పేర్కొన్నారు. మార్చి మొదటివారంలో ముస్లిం సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుంది. ‘‘ఆర్యను మా ఇంటి అల్లుడిగా స్వాగతించడానికి ఆనందిస్తున్నాం’’ అని సాయేషా తల్లి షహీన్ అహ్మద్ పేర్కొన్నారు. ‘అఖిల్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సాయేషా ప్రస్తుతం తమిళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ∙ఆర్య, సాయేషా -
‘లవర్స్ డే’ మూవీ రివ్యూ
టైటిల్ : లవర్స్ డే జానర్ : లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : రోషన్, ప్రియా ప్రకాశ్ వారియర్, నూరీన్ షరీఫ్ సంగీతం : షాన్ రెహమాన్ దర్శకత్వం : ఒమర్ లులు నిర్మాత : ఎ.గురురాజ్, సి.హెచ్. వినోద్ రెడ్డి ఒక్క కన్నుగీటుతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ఇక ముద్దు గన్నును పేల్చి ఎన్నో కోట్ల హృదయాలకు గాయం చేసిన ఈ అమ్మడు సోషల్‌మీడియా క్వీన్‌గా మారిపోయింది. ప్రియా వారియర్ పైనే ‘లవర్స్ డే’ మూవీ ఆధారపడి ఉందంటేనే ఎంతటి క్రేజ్‌ను సంపాదించిందో తెలిసిపోతోంది. మరి ప్రియాకు వచ్చిన క్రేజ్.. ఈ మూవీని గట్టెక్కేలా చేసిందా? ప్రేమికుల రోజున వచ్చిన ‘లవర్స్ డే’ చిత్రం ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది ఓ చూసారి చూద్దాం.. కథ : కాలేజ్.. స్నేహితులు.. ప్రేమ.. కుళ్లు జోకులు.. సింపుల్‌గా చెప్పాలంటే ఈ మూవీ కథ ఇదే. రోషన్.. ప్రియ.. గాధ.. ల మధ్య జరిగే కథే ఈ చిత్రంలో ప్రత్యేకం. రోషన్.. గాధ స్నేహితులుగా మొదలై ప్రేమికులుగా మారిపోతారు. అయితే వారి ప్రేమను వ్యక్త పరిచాలనుకునే సమయానికి అనుకోని సంఘటన జరుగుతుంది. (సాక్షి రివ్యూస్) అనుకోని ఆ సంఘటన ఏంటి.. అసలు ఈ కథ లో వింక్ గర్ల్ ప్రియ వారియర్ పాత్ర ఏంటి అనేది మిగతా కథ. నటీనటులు : కాలేజ్ కుర్రాడిగా రోషన్.. అతని స్నేహితులు బాగానే నటించారు. ముఖ్యంగా రోషన్ లవర్ బాయ్ గా అమ్మాయిల మనసు దోచేస్తాడు. ఇక ప్రియ తనకు బాగా పేరు తెచ్చిన.. కన్ను గీటే సీన్.. ముద్దు గన్ను సీన్స్‌తో థియేటర్లో విజిల్స్ కొట్టిస్తుంది. టీజర్, ట్రైలర్లను చూసి ప్రియానే మెయిన్ లీడ్ అనుకుంటే పొరపాటే. (సాక్షి రివ్యూస్) గాధ పాత్రలో నటించిన నూరిన్ షరీఫ్.. ప్రియా కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. అందం.. అభినయంతోనూ నూరీన్ ఆకట్టుకుంది. ఇక హీరో స్నేహితులు, ప్రిన్సిపాల్, లెక్చరర్, ప్యూన్ పాత్రలు నవ్విస్తాయి. విశ్లేషణ : ఇలాంటి కథలు మనం ఎప్పుడో చూసేసాం. గతంలో వచ్చిన చిత్రం, నువ్వు నేను, సొంతం లాంటి ఎన్నో సినిమాల్లో ఈ కాన్సెప్టే మనకు కనబడుతుంది. లెక్చరర్లు స్టూడెంట్స్ మధ్య వచ్చే కుళ్లు జోకులు.. ప్రేమ.. ఆకర్షణ.. స్నేహితులు.. వీటి చుట్టే తిరిగే ఈ కథ.. ఓ వయసు వారిని మాత్రం ఆకట్టుకుంటుంది. అయితే సినిమా అంతా సరదాగా వెళ్తూ ఉంటే.. మరీ నాసిరకంగా ఉంటుందేమో అనో.. లేక ముగింపు ఎలా ఇవ్వాలో తెలియక దర్శకుడు విషాదంతో సినిమాను ముగించేశాడు. (సాక్షి రివ్యూస్) ప్రేమకు ఆకర్షణకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుని తను నిజంగా ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమను చెప్పే సందర్భంలో ఆ పాత్రను ముగించి.. అసలు దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాలేదు. ఇక సంగీతం కొన్ని చోట్ల పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్. -
‘కళ’లో విరిసిన ప్రేమ..
సాక్షి,సిటీబ్యూరో: సిరిపురం శ్రీ,నివాస్ (అలియాస్ శ్రీను 65 ) ఆల్ రౌండర్ ఆర్టిస్టు. స్వాతి రింగ్ డ్యాన్సర్. ఓ ఈవెంట్లో కలిసిన ఈ జంట ప్రేమ బాసలు చెప్పుకుని.. తర్వాత పెళ్లిపీటలెక్కి.. ఇప్పుడు ఓ ఇంటివారయ్యారు. వాలంటైన్స్‌డే సందర్భంగా తమ ప్రేమ ప్రయాణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘మా ప్రేమ 2012 మార్చిలో 19న మధురానగర్‌లో ఓ ఈవెంట్లో చిరురించింది. ఆ ప్రయాణం 2017 జూలై 30 దాకా సాగి ఆ రోజు వివాహంగా మారింది’ అంటూ చెప్పుకొచ్చారు శ్రీను. ‘స్వాతి తొలుత నెయిల్ ఆర్ట్ వేసేది. నేను మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ చేసేవాడిని. ముందు నేనే స్వాతికి ప్రపోజ్ చేశాను. తర్వాత ఏవేవో కవిత్వాలు చెప్పే వాడిని. కొన్నాళ్లకు తాను నా ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఏడాది తర్వాత ఇద్దరం కలిసి ‘వాట్ ఈజ్ లైఫ్’ అని ప్రశ్న వేసుకున్నాం. జీవితం అంటే ప్రేమ కాదు.. ఒక ఆశయం అని ఇద్దరం అనుకున్నాం. ఇప్పుడు చేసే ఆర్ట్ ఫామ్స్ కాకుండా సరికొత్తగా ఎవరూ చేయనివి చేయాలని నిర్ణయించుకున్నాం. 2014లో స్వాతి ప్రోత్సాహంతో మ్యాజిక్ షో ప్రారంభించాను. తర్వాత ఆ కళను కొత్తగా చేయడం ప్రారంభించాను. స్వాతి ప్రోత్సాహంతోనే డ్రస్ ఛేంజ్, లిల్లీపుట్ యాక్టింగ్ ప్రయత్నించాను. నాతోపాటు తను కూడా కొత్తగా రింగ్ డ్యాన్స్ మొదలు పెట్టింది. ఈ డ్యాన్స్ జిమ్నాస్టిక్స్తో సమానం. చిన్నప్పుడే నేర్చుకోవాలి. 21 ఏళ్ల వయసులో స్వాతి 12 గంటల పాటు ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది. ఇద్దరం కలిసి చేస్తూండగా 2016లోనే ‘జబర్దస్త్’లో ఇద్దరికీ ఛాన్స్ వచ్చింది. రాకింగ్ రాకేశ్ టీంలో చేరాను. కొత్త వృత్తిలో కుదుటపడ్డాం కదా అని మా ప్రేమ విషయం ఇద్దరం పెద్దల దృష్టికి తీసుకెళ్లాం. మా ఇంట్లో ఒప్పుకోలేదు.. వాళ్ల ఇంట్లో ఒప్పుకున్నారు. తాను నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లి వారి పెద్దలకు పరిచయం చేసింది. వారు నా నడవడిక గమనించి ఓకే చెప్పారు. ఏడాది తర్వాత మా ఇంట్లో వారు కూడా ఒప్పుకున్నారు. 2017 జూలై 30న మా ప్రేమ పెద్దల అంగీకారంతో వివాహ బంధంగా మారింది. స్వాతితో కలిసి 16 రకాల కళారూపాలను ప్రదర్శిస్తాను’ అంటూ వివరించాడు శ్రీను. స్వాతి మాట్లాడుతూ.. ‘జీవితంలో ఇద్దరు కలిసి ఎదిగేందుకు ప్రేమ అండగా ఉండాలి. అంతకు మించి ఒక ఆశయం కావాలి. వృత్తిలో ఎదిగేందుకు ఒకరి సలహాలు ఇంకొకరు తీసుకోవాలి. అలాగే మేం కలిసి సాగుతున్నాం. ప్రేమికులకు ఒకటే సలహా.. ఒకరినొకరు అర్థం చేసుకొన్నాకే పెళ్లికి వెళ్లాలి. అత్తామామలు, అమ్మనాన్నలు ఇద్దరు ఒక్కటే అనే భావన ఉండాలి. అప్పుడే కుటుంబ బంధం మరింత బలపడుతుంది’ అంటూ ముగించింది. -
లవర్స్‌కి ‘లైన్’ వేశారు!
వలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు తమకు నచ్చిన గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకోవడానికిసిద్ధమయ్యారు. దీంతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్ల నిర్వాహకులు వారికి ‘లైన్’వేస్తున్నారు. విభిన్న గిఫ్ట్‌లతో ప్రేమికుల మదిని దోచుకోనున్నారు. సిటీలోని పలురెస్టారెంట్లు, పబ్స్ నిర్వాహకులు ప్రేమికుల కోసం ఎన్నో వెరైటీ కార్యక్రమాలకుసన్నద్ధమవుతున్నారు. ఫొటో ఆర్ట్ ఫర్ లవర్స్ ప్రపంచ వ్యాప్తంగా ‘గ్లోబల్ లగ్జరీ గ్రూప్’ వాళ్లు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ప్రపంచం మొత్తం మీద ఎవరైనా సరే తమకు నచ్చిన ఫొటోని ‘www.handpaintedstories.com’ వెబ్సైట్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలో ఆ ఫొటోను ఆర్ట్‌గా గీసి తిరిగి వెబ్సైట్లోనే పోస్ట్ చేస్తారు. అంతే కాదు ఫొటోకు సంబంధించిన స్టోరీని కూడా పోస్ట్ చేస్తారు. ఇది లవర్స్‌కి ప్రత్యేకమనే చెప్పాలి. తక్కువ ధరల్లో చక్కటి గిఫ్ట్‌లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెట్లలో కళ్లు జిగేల్మనిపించే గిఫ్ట్‌లు ఉన్నాయి. ప్రారంభ ధర రూ.99 నుంచి మనసుకు నచ్చినవి సొంతం చేసుకోవచ్చు. ఒక్క క్లిక్ కొడితే చాలు మనచేతిలో ఉంటాయి. కపుల్స్ డిన్నర్ సిటీలోని పలు హోటల్స్ కపుల్స్ కోసం డిన్నర్‌ను ప్లాన్ చేస్తున్నాయి. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ‘పార్క్ హయత్, ది హ్యాత్, తాజ్‌బంజారా, తాజ్‌కృష్ణా, దసపల్లా’ లాంటి అనేక హోటల్స్ డిన్నర్ థీమ్‌ను ఏర్పాటు చేశాయి. షాపింగ్ అదుర్స్ అమ్మాయిల కోసం టాప్స్, జ్యువెలరీ, రింగ్స్, అబ్బాయిల కోసం వాచెస్, హ్యాండ్ జ్యువెలరీస్, నెక్ జ్యువెలరీస్ ప్రస్తుతం సిటీలోని షాపింగ్ మాల్స్‌లో హల్చల్ చేస్తున్నాయి. షాపర్స్ స్టాప్, సిటీసెంటర్, అన్లిమిటెడ్, మ్యాక్స్ వంటి ప్రధాన షోరూంలలో ఇవి అందుబాటులో ఉన్నాయి. పబ్స్‌లో అలనాటి గీతాలు సిటీలోని పలు రెస్టారెంట్స్‌తో పాటు పబ్స్ కూడా కపుల్స్ కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. పబ్స్‌లో వైట్డ్రస్లో కపుల్స్‌ని ఆహ్వానిస్తున్నారు. తెలుగు పాటలతో బ్యాండ్ కపుల్స్ కోసం అలనాటి పాటలను పాడుతూ వారిని ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాయి. స్పెషల్ రోజెస్ ఫర్ లవర్స్ విభిన్న రకాల, కలర్స్‌లో ఉన్న రోజ్ ఫ్లవర్స్ ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి. సిటీకి చెందిన సోనాల్ అగర్వాల్ ‘ఫ్లవర్వలీ’ పేరుతో రోజా పూలు విక్రయిస్తున్నారు. రోజా పూలతో పాటు టెక్నాలజీ ప్రింటెడ్ రోజెస్ అన్నీ సిటీలో, ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి. -
పాత రోజులు గుర్తొస్తాయి
ప్రియా ప్రకాశ్ వారియర్, రావూఫ్ రోషన్ జంటగా నటించిన చిత్రం ‘లవర్స్ డే’ (మలయాళంలో ‘ఒరు ఆడార్ లవ్). ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి సుఖీభవ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాతలు ఎ.గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి అందిస్తున్నారు. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) విడుదల కానుంది. నిర్మాత ఎ. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘ఒరు ఆడార్ లవ్’ సినిమాపై క్రేజ్ పెరగడంతో తెలుగు హక్కుల కోసం టాలీవుడ్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. దాంతో భారీ మొత్తాన్ని వెచ్చించి హక్కులను సొంతం చేసుకొన్నాం. ఇందుకు సహకరించిన సీతారామరాజు, సురేష్ వర్మలకు థ్యాంక్స్. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఒమర్ లులు ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరూ తమ యూత్ రోజులను గుర్తు చేసుకొంటారు. స్నేహం, ప్రేమ విలువను అద్భుతంగా చెప్పారు. గతంలో వచ్చిన ‘ప్రేమసాగరం, ప్రేమదేశం’ లాంటి సినిమాల రేంజ్లో ఉంటుంది ఈ సినిమా’’ అన్నారు . ‘‘ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లకు పైగా రిలీజ్ అవుతోంది. తెలుగులో సుమారు 600 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత వినోద్ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: శీను సిద్ధార్థ్, సంగీతం: షాన్ రెహమాన్. -
లవర్స్‌డే టీజర్ : ఏంటి?.. ఏమీ లేదు.. ఏమీ లేదా’
జస్ట్ అలా అలవోకగా కన్ను కొట్టి కుర్రకారు హృదయాలను దోచేసుకున్నారు మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. లక్షల మంది కుర్ర హృదయాలను కొల్లగొట్టేసిన ఈ కన్నుకొట్టుడు పిల్ల నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ ‘లవర్స్ డే’ మూవీని విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రొమాంటిక్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఏంటి?.. ఏమీ లేదు.. ఏమీ లేదా!.. ఇది చెప్పడానికేనా నన్ను రమ్మన్నావు.. అది మన మధ్య.. మన ఇద్దరికీ ఇంత త్వరగా సెట్ అవుతుందని నేను అనుకోలేదు.. అయ్యా..సెట్ అయిందా ఏంది సెట్ అయింది. మరి నిన్న నాకు ఎందుకు సైట్ కొంటావ్.. నేనా’ అంటూ రోషన్, ప్రియా వారియర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినీ ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. షాన్ రెహమాన్ అందించిన బ్యాగ్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.ఈ చిత్రానికి ఒమర్ లులు దర్శకత్వం వహించారు. సుఖీభవ సినిమాస్ పతాకంపై ఎ.గురురాజ్, సి.హెచ్. వినోద్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. -
ప్రియా వారియర్ ‘లవర్స్ డే’ మూవీ స్టిల్స్
-
ప్రేమికుల రోజు
జస్ట్ అలా అలవోకగా కన్ను కొట్టి కుర్రకారు హృదయాలను దోచేసుకున్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’ టీజర్లో ప్రియా కన్ను కొట్టడం, ఆ టీజర్ వైరల్ అవ్వడం తెలిసిందే. రోషన్, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. ఈ చిత్రానికి ఒమర్ లులు దర్శకత్వం వహించారు. సుఖీభవ సినిమాస్ పతాకంపై ఎ.గురురాజ్, సి.హెచ్. వినోద్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఈ నెల 14న పేమికుల దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి బన్నీ (అల్లు అర్జున్) అందించిన సహకారాన్ని మర్చిపోలేం. తెలుగులో ప్రియా వారియర్ పాత్రకు సింగర్ లిప్సిక డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రంలో ఎనిమిది పాటలు ఉన్నాయి. ఇందులో ఓ పాట ఆడియన్స్‌కు థియేటర్లో సర్ప్రైజ్గా ఉంటుంది. మంచి బిజినెస్ జరిగింది’’ అని అన్నారు. ఈ సినిమాకు షాన్ రెహమాన్ స్వరకర్త. -
సపోర్ట్ చేయడం నా బాధ్యత అనుకున్నా
‘‘సౌత్ ఇండియన్ సినిమాల్లో నేషనల్ వైడ్‌గా, ఇంటర్నేషనల్ వైడ్‌గా వైరల్ అయిన వీడియోస్‌లో ‘కొలవెరి డీ..’ పాట, ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’... ఈ మధ్య కాలంలో ఆ రేంజ్లో వైరల్ అయిన వీడియోస్‌లో ‘ఒరు ఆధార్ లవ్’ కూడా ఒకటి’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ప్రియా ప్రకాష్ వారియర్, నూరిన్ షరీఫ్, రోషన్ ముఖ్య తారలుగా ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. ఈ చిత్రాన్ని ‘లవర్స్ డే’ పేరుతో సుఖీభవ సినిమాస్ పతాకంపై ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. షాన్ రెహమాన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘నాకు సౌతిండియా అంటే పిచ్చి. నా ప్రొఫెషన్లో సౌతిండియన్ యాక్టర్ అని రాసుకుంటాను. నేను దక్షిణాదికి చెందినవాడినని చెప్పుకోవడానికి గర్వపడతాను. నేను పుట్టింది చెన్నైలో.. పెరిగింది హైదరాబాద్‌లో.. మలయాళం, కర్ణాటకవాళ్లు కూడా నన్ను ఆదరిస్తున్నారు. కాబట్టి నేను సౌతిండియన్‌నే. నా సినిమాలను కేరళవాళ్లు సొంత సినిమాల్లాగా ఆదరిస్తున్నారు. ఓ ల్యాండ్ మార్క్ ఉన్న మలయాళ సినిమా తెలుగులోకి వస్తున్నప్పుడు నేను సపోర్ట్ చేయాలని భావించా. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సమయంలో వినోద్ రెడ్డిగారిని ‘బన్నీ’వాసు పరిచయం చేశాడు. ఆయన అడగ్గానే నేను ఈ ఫంక్షన్‌కి వచ్చా. నేను ఎంత కాలం నిలబడగలనో తెలియదు కానీ.. అవకాశం ఉన్న ప్రతిసారీ నా కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరి కోసం నిలబడతా’’ అన్నారు. ‘‘మలయాళంలో ఎంత మంది స్టార్స్ ఉన్నా మా సినిమా వీడియోను ఎవరూ షేర్ చేయలేదు. అల్లు అర్జున్‌గారు మాత్రమే షేర్ చేశారు’’ అన్నారు ఒమర్ లులు. ‘‘అల్లు అర్జున్‌గారంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి స్టేజ్‌పై నిలబడే అవకాశం వస్తుందనుకోలేదు. ఆయన్ను కలుసుకున్నందుకు వెరీ హ్యాపీ’’ అని ప్రియా ప్రకాష్ వారియర్ అన్నారు. ‘‘మా యూనిట్‌ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అల్లు అర్జున్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు చిత్రసమర్పకుడు వినోద్ రెడ్డి. ‘‘సీతారామరాజుగారు, సురేశ్‌గారి సపోర్ట్‌తో ‘లవర్స్ డే’ సినిమా అవకాశం దక్కించుకున్నాను. అల్లు అర్జున్‌తో పాటు చాలా మంది నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇందుకు వారికి థ్యాంక్స్’’ అని ఎ.గురురాజ్ అన్నారు. నటుడు అలీ, నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ, పాటల రచయిత చైతన్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘లవర్స్ డే’ వేడుకలో బన్నీ