ప్రేమికుల రోజున ఏయ్‌ పిల్లా.. | Fall In Love With Musical Preview Of Aye Pilla Song on valentines day | Sakshi
Sakshi News home page

ప్రేమికుల రోజున ఏయ్‌ పిల్లా..

Published Thu, Feb 13 2020 12:17 AM | Last Updated on Thu, Feb 13 2020 12:17 AM

Fall In Love With Musical Preview Of Aye Pilla Song on valentines day - Sakshi

నాగచైతన్య, సాయిపల్లవి

‘ఏయ్‌ పిల్లా..’ అంటూ ప్రేమగీతాలాపన చేశారు నాగచైతన్య. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరి’. ఎమిగోస్‌ క్రియేషన్స్, సోనాలి నారంగ్‌ సమర్పణలో నారాయణ్‌దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాలోని ‘ఏయ్‌ పిల్లా..’ అనే పాట మ్యూజికల్‌ ప్రివ్యూను నిమిషం నిడివితో ప్రేమికుల రోజు సందర్భంగా రేపు ఉదయం 11గం టల 07 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ స్కూల్‌కి చెందిన పవన్‌ సి.హెచ్‌ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు భాస్కర్‌ కటకం శెట్టి సహ–నిర్మాత. ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ సి.కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement