దర్శకుడిగా మారిన విలన్‌! | Senior Actor Sathya Prakash Turns As Director With Ullala Ullala Movie | Sakshi
Sakshi News home page

సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఉల్లాలా ఉల్లాలా’

Published Fri, Sep 13 2019 6:41 PM | Last Updated on Fri, Sep 13 2019 6:41 PM

Senior Actor Sathya Prakash Turns As Director With Ullala Ullala Movie - Sakshi

సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్ పేరు చెప్ప‌గానే ‘పోలీస్ స్టోరీ’ సినిమా గుర్తుకొస్తుంది. ఈ ఒక్క సినిమా అనే కాదు, ఎన్నో ఎన్నెన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో ప్ర‌తినాయ‌కుడిగానూ, ముఖ్య పాత్ర‌ధారిగానూ రాణించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందారు. 11 భాష‌ల్లో 500కు పైగా చిత్రాల్లో న‌టించిన ఈ సీనియ‌ర్ న‌టుడు తొలిసారిగా మెగాఫోన్ చేత‌బ‌ట్టారు. స‌త్య‌ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పేరు ‘ఉల్లాలా ఉల్లాలా’. గ‌త వాలంటైన్స్ డేకి భారీ ఎత్తున ‘ల‌వ‌ర్స్ డే’  చిత్రాన్ని విడుద‌ల చేసి మంచి నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న సుఖీభ‌వ మూవీస్ అధినేత ఎ.గురురాజ్ `ఉల్లాలా ఉల్లాలా` చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు స‌త్య‌ప్ర‌కాష్ మాట్లాడుతూ ‘తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం, ఒరియా, బెంగాలీ, భోజ్‌పురి, మ‌రాఠీ, పంజాబీ, హిందీ, ఇంగ్లీషు భాష‌ల్లో 500కు పైగా సినిమాల్లో న‌టించాను. ‘పోలీస్ స్టోరీ’, ‘సీతారామ‌రాజు’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘స‌మ‌ర సింహారెడ్డి’, ‘మాస్ట‌ర్‌’, ‘డేంజ‌ర్‌’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘బిగ్ బాస్‌’ త‌దిత‌ర చిత్రాలు నాకెంత‌గానో పేరు తెచ్చిపెట్టాయి. ఇన్నేళ్ల కెరీర్‌లో న‌టుడిగా పూర్తిస్థాయి సంతృప్తితో ఉన్నాను. ద‌ర్శ‌క‌త్వం చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను. ఇప్ప‌టికి కుదిరింది. ఇదొక రొమాంటిక్ ఎంట‌ర్‌టైనింగ్  థ్రిల్ల‌ర్‌. ఈ సినిమాలో చాలా వింత‌లూ విశేషాలూ ఉన్నాయి. ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలో ఈ సినిమా ఉంటుంది. మేకింగ్ ప‌రంగా కూడా చాలా కొత్త‌గా ఉంటుంది. ద‌ర్శ‌కునిగా నా తొలి చిత్రానికి గురురాజ్‌లాంటి నిర్మాత దొర‌క‌డం నా అదృష్టం’ అని అన్నారు. న‌ట‌రాజ్‌, నూరిన్‌, అంకిత హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement