
వాలెంటైన్స్ డే రోజున లవర్స్‌తో రొమాన్స్ చేస్తున్న కూతురును రెడ్‌హ్యాండెడ్‌గా..
సోషల్ మీడియా అనగానే ఎన్నో వింతలు, విశేషాలు, ఫన్నీ వీడియోలు దర్శనమిస్తాయి. కాగా, సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎంతో మంది లవర్స్‌ను వారి రిలేటివ్స్, పేరెంట్స్ పట్టుకుని చితకబాదిన వీడియోలు చాలానే చూసి ఉంటాం. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఆమె ఇంటిపై రహస్యంగా కలిసింది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లి.. టెర్రస్ మీదకు వచ్చింది. అనంతరం.. టెర్రస్ మీద దాక్కున్న సదరు యువకుడి కోసం గాలించి పట్టుకుంది. బాయ్‌ఫ్రెండ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అతడిని పట్టుకుని చితకబాదుతూ.. చెప్పుతో కొట్టింది. ఇంతలో అతను.. ఆమె చేతిలో నుంచి తప్పించుకుని కిందకు పారిపోయాడు. దీంతో, ఆమె.. పట్టుకోండి వాడిని పట్టుకోండి అంటూ కేకలు వేసింది.
తర్వాత, తల్లి తన కూతురు వద్దకు వచ్చి ఆమెను కూడా చితకబాదింది. కూతురు చేసిన పనికి తల్లి.. తన చెప్పుతో కొడుతూ తిట్టింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆంటీ జీ.. మీ కూతురుకు తొందరాగా పెళ్లి చేయండి అని కామెంట్ చేశారు. మరో నెటిజన్.. అర్రే.. వాలెంటెన్స్ డే రోజున ప్రేమికులు దొరికిపోయారే అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు.
Desi mom catches daughter romancing with boyfriend on terrace, beats them with chappal.pic.twitter.com/AiuTjXTOKJ
— RAGHAV (@Raaghav27) February 16, 2023