lover house
-
ఆరేళ్ల ప్రేమ, ఐదేళ్ల కిందట వేరొకరితో పెళ్లి.. కొడుకు పుట్టాక ప్రియుడు కావాలని..
నల్గొండ : తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన ప్రియుడు మోసం చేశాడంటూ వివాహిత రోడ్డుపై ధర్నా చేపట్టింది. ఈ ఘటన వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన తరికొప్పుల శిరీష, ఆమనగల్లుకు చెందిన మహేష్ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం శిరీష ఇంట్లో తెలియడంతో ఐదేళ్ల క్రితం ఆమెకు కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో వివాహం చేశారు. అయినప్పటికీ శిరీష, మహేష్ మధ్య ప్రేమ కొనసాగుతూనే వచ్చింది. శిరీష విడాకులు తీసుకుంటే తాను వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె తన భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమెతో పెళ్లికి మహేష్ నిరాకరిస్తున్నాడు. ఈ విషయమై పెద్ద మనుషులను ఆశ్రయించినప్పటికీ పట్టించుకోకపోవడంతో శనివారం మహేష్ స్వగ్రామమైన ఆమనగల్లుకు శిరీష చేరుకొని తనను పెళ్లి చేసుకోవాలని భీమారం–సూర్యాపేట రహదారిపై ధర్నా చేపట్టింది. అయితే శిరీష తన భర్తతో లీగల్‌గా విడాకులు తీసుకోలేదని, ఆమెకు మూడేళ్ల వయస్సు గల కుమారుడు ఉన్నట్లు తెలిసింది. -
బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు సీక్రెట్ మీట్.. తల్లి ఏం చేసిందంటే..
సోషల్ మీడియా అనగానే ఎన్నో వింతలు, విశేషాలు, ఫన్నీ వీడియోలు దర్శనమిస్తాయి. కాగా, సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎంతో మంది లవర్స్‌ను వారి రిలేటివ్స్, పేరెంట్స్ పట్టుకుని చితకబాదిన వీడియోలు చాలానే చూసి ఉంటాం. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఆమె ఇంటిపై రహస్యంగా కలిసింది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లి.. టెర్రస్ మీదకు వచ్చింది. అనంతరం.. టెర్రస్ మీద దాక్కున్న సదరు యువకుడి కోసం గాలించి పట్టుకుంది. బాయ్‌ఫ్రెండ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అతడిని పట్టుకుని చితకబాదుతూ.. చెప్పుతో కొట్టింది. ఇంతలో అతను.. ఆమె చేతిలో నుంచి తప్పించుకుని కిందకు పారిపోయాడు. దీంతో, ఆమె.. పట్టుకోండి వాడిని పట్టుకోండి అంటూ కేకలు వేసింది. తర్వాత, తల్లి తన కూతురు వద్దకు వచ్చి ఆమెను కూడా చితకబాదింది. కూతురు చేసిన పనికి తల్లి.. తన చెప్పుతో కొడుతూ తిట్టింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆంటీ జీ.. మీ కూతురుకు తొందరాగా పెళ్లి చేయండి అని కామెంట్ చేశారు. మరో నెటిజన్.. అర్రే.. వాలెంటెన్స్ డే రోజున ప్రేమికులు దొరికిపోయారే అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. Desi mom catches daughter romancing with boyfriend on terrace, beats them with chappal.pic.twitter.com/AiuTjXTOKJ — RAGHAV (@Raaghav27) February 16, 2023 -
ఏడేళ్లుగా ప్రేమించాడు.. పెళ్లంటే వద్దన్నాడు.. షాకిచ్చిన ప్రియురాలు.. ఏం చేసిందంటే?
పొదలకూరు(నెల్లూరు జిల్లా): ఏడేళ్లుగా ప్రేమించి, మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లి చేసుకోవాలని కోరితే ముఖం చాటేశాడని ఓ యువతి యువకుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఈ ఘటన పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు చేజర్ల మండలం ఏటూరుకు చెందిన యువతి, పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామానికి చెందిన హరినారాయణ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చదవండి: స్మగ్లింగ్‌లో ‘పుష్ప’ను మించిపోయాడు.. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామని యువతి కోరగా, ఆ యువకుడు స్పందించలేదు. దీంతో బాధితురాలు ప్రియుడు హరినారాయణ తనను నమ్మించి మోసం చేశాడంటూ దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ స్టేట్ సెక్రటరీ అరుణ, సభ్యులతో కలిసి యువకుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. తాను ఎస్సీ కులం కావడంతో హరినారాయణ పెళ్లికి నిరాకరిస్తున్నట్లు బాధితురాలు వాపోయింది. ఈ విషయంపై ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపింది. పోలీసులు వెంటనే హరినారాయణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. హరినారాయణతోనే తన వివాహం జరిపించాలని విజ్ఞప్తి చేసింది. -
పెళ్లి.. భర్తతో విడాకులు.. ప్రియుడితో ఇంటి నుంచి పారిపోయి
సాక్షి, ఆదిలాబాద్: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌనపోరాటానికి దిగిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం... లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన నరేష్, ఓ యువతి గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతికి వేరే వ్యక్తితో పెళ్లి కాగా, నరేష్ సైతం మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల సదరు యువతి తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. నరేష్‌తో వారం రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకుంది. మళ్లీ ఇరువురు లోకేశ్వరం చేరుకుని ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి సదరు యువతి నరేష్ ఇంటికి వెళ్లింది. దీంతో నరేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. బాధితురాలు అక్కడే మౌనపోరాటానికి దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సర్ధిచెప్పి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బుధవారం ఉదయం ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడుతున్నారు. చదవండి: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. కచ్చితంగా పాటించాల్సిందే! -
నువ్వే నా లోకమంటూ ప్రేమ పేరిట దగ్గరై..
సాక్షి, ఖమ్మం రూరల్ : నువ్వే నా లోకం.. అంటూ ప్రేమ పేరిట దళిత యువతి వెంట పడిన యువకుడు, శారీరకంగా ఒక్కటైన అనంతరం పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపిస్తూ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలంలోని కోదాడ క్రాస్‌రోడ్డులో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. కోదాడ క్రాస్‌రోడ్డులో నివసిస్తున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన గునిగంటి పవన్‌కృష్ణ, భద్రాద్రి జిల్లా చర్లకు చెందిన దళిత యువతి సీహెచ్. దీప్తిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడగా, శారీరకంగా కలవడంతో దీప్తి గర్భం దాల్చింది. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా పవన్‌కృష్ణ కాలయాపన చేస్తుండడంతో ఈనెల 15న ఆయన ఇంటి ఎదుట మౌనదీక్ష చేపట్టింది. ఆ సమయాన పవన్‌కృష్ణ కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులు సర్దిచెప్పడంతో దీక్ష విరమించినా ఆ తర్వాత ఫలితం లేకపోవడంతో బుధవారం పురుగుల మందు తాగింది. దీంతో రూరల్ పోలీసులు ఆమెను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో దీప్తి మాట్లాడుతూ.. తనను శారీరకంగా వాడుకుని గర్భవతిని చేసిన పవన్ ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని, తల్లిదండ్రులు కూడా లేని తనకు న్యాయం చేయాలని తెలిపారు. గతంలో అబార్షన్ చేయించుకోవాలని సూచించగా, భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంతో పాటు చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అంతేకాక కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్న పవన్‌కృష్ణ, తనపై దుష్ప్రచారం చేయడంతో పాటు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. ఈమేరకు అధికారులు స్పందించిన పవన్‌తో తన పెళ్లి జరిపించాలని ఆమె కోరారు. -
ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష
బాపట్ల: ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడు మరో వివాహానికి సిద్ధమయ్యాడని ప్రియురాలు మౌన దీక్ష చేపట్టింది. బాపట్ల పట్టణంలోని రాజీవ్‌గాంధీ కాలనీకి చెందిన నాగార్జున అనే యువకుడు తనను ప్రేమ పేరుతో మోసం చేసి మరో వివాహానికి సిద్ధమౌతున్నాడని కృష్ణాజిల్లాకు చెందిన నాగజ్యోతి అనే యువతి దీక్ష చేపట్టింది. విజయవాడలో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ ఐదేళ్ళుగా ప్రేమించుకుంటున్నామని నాగజ్యోతి వివరించింది. ఇటీవల హైదరాబాద్‌కు మకాం మార్చిన నాగార్జున తనను దూరంగా పెట్టి మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడని తెలిపింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని, వివాహం కోసం ఒప్పించేందుకు బాపట్లకు వస్తే కనిపించకుండా వెళ్ళిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనను వివాహం చేసుకునే వరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేసింది. చదవండి: తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు.. గ్రామాల వైపు.. గజరాజుల చూపు! -
ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగిన యువతి
-
ప్రేమించానన్నాడు.. పెళ్లి అంటే వద్దంటున్నాడు
సాక్షి, పత్తికొండ టౌన్: ‘మూడేళ్లుగా ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకోమంటే ఇపుడు వద్దంటున్నాడు. న్యాయం చేయండి’ అంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముం దు బైఠాయించిన ఘటన శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగింది. యువతి, ఆమె బంధువులు తెలిపిన వివరాలు.. పత్తికొండకు చెందిన పవన్ హైదబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన యువతి బీటెక్ చదివి ఇంటివద్దే ఉంటోంది. రైలు ప్రయాణంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి అనంతరం ప్రేమకు దారితీసింది. మూడేళ్లుగా వీరి ప్రేమ కొనసాగింది. పెళ్లి›చేసుకుందామని యువతి ప్రస్తావన తీసుకురావడంతో పవన్ అంగీకరించకపోవడంతో పాటు 10 నెలల నుంచి కలవకుండా, ఫోన్లో స్పందించకుండా దూరం పెట్టాడు. ఈ విషయమై వారం రోజుల క్రితం పత్తికొండకు బంధువులతో కలసి వచ్చిన యువతి.. పవన్ తనను పెళ్లి చేసుకోవాలని పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టింది. పంచాయతీలో పవన్, వారి బంధువులు అంగీకరించకపోవడంతో న్యాయం చేయాలని కోరుతూ గురువారం ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. సమాచారం తెలుసుకున్న పవన్, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. ఎస్ఐ శ్రీనివాసులు, పోలీసుసిబ్బంది యువతిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. సీఐ కృష్ణయ్య యువతి, వారి బంధువులతో మాట్లాడారు. పవన్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని, పెళ్లికి అంగీకరించకపోతే కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. -
ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటం
సురే్ధపల్లి(నేలకొండపల్లి) : ప్రేమించానన్నాడు... పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. చెట్టాపట్టాలు వేసుకుని తిప్పాడు.. తీరా తనకు సంబంధం లేదని నెట్టేస్తున్నాడు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. నేలకొండపల్లి మండలంలోని సురే్ధపల్లి గ్రామానికి చెందిన నాగుల్‌మీరా అనే యువతికి అదే గ్రామానికి చెందిన తోళ్ల ఉపేందర్ అనే యువకుడుకి గత ఏడేళ్ల క్రితం ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఇటీవల ఇద్దరు బైక్‌పై భద్రాచలం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో నాగుల్‌మీరా గాయపడింది. అప్పట్లో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా తాను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించాడు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొమ్మని అడుగగా తాను చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో సదరు యువతి తనకు న్యాయం చేయాలని ఆదివారం ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటంకు ది గింది. తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పింది. విషయం తెలుసుకుని స్థానిక పోలీ సులు సంఘటనా స్థలంకు చేరుకుని బాధితురాలితో పాటు అబ్బాయి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. -
హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో మోసం
-
న్యాయం కోసం ప్రియురాలి ఆందోళన
హైదరాబాద్: పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడం తో ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగిందో యువతి. హయత్‌నగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. తుర్కయంజాల్‌కు చెందిన ఉమామహేశ్వరి (22) బీఈడీ మొదటి సంవత్సరం చదువుతోంది. వరుసకు బావ అయిన బ్రాహ్మణపల్లికి చెందిన గుర్రం సుధీర్‌రెడ్డి ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని ఆరు నెలలుగా ఆమెను వెంట తిప్పుకున్నాడు. తన చెల్లెలి పెళ్లి అయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆమెకు చెప్పాడు. సోదరి పెళ్లి అయ్యాక మా ఇంట్లో ఒప్పుకోవడంలేదని ముఖం చాటేశాడు. దీంతో ఉమామహేశ్వరి ఈ నెల 5న ఆదిభట్ల ఠాణాలో గుర్రం సుధీర్‌రెడ్డిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని పిలిచి యువతి జీవితాన్ని పాడుచేయొద్దని హెచ్చరించారు. మూడు రోజుల సమయం కావాలని అతని తల్లిదండ్రులు పోలీసులను కోరారు. ఆ తర్వాత ఎలాంటి ఫలితంలేకపోవడంతో బాధితురాలు మళ్లీ పోలీసులను ఆశ్రయించగా...‘ సుధీర్‌రెడ్డి సైకో, అతడి ప్రవర్తన బాలేదు. బాగా చదువుకొని మరో వ్యక్తిని పెళ్లి చేసుకో’ అని సలహా ఇచ్చి పంపేశారు. దీంతో నిరాశ చెందిన బాధితురాలు ఎన్నోసార్లు ఆత్మహత్యకు యత్నించగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. ప్రియుడి ఇంటి ముందు ఆందోళన.... సుధీర్‌రెడ్డే సర్వస్వం అనుకున్నానని, అతడితోనే తన చావైనా, బతుకైనా అంటూ ఉమామహేశ్వరి శుక్రవారం ఉదయం నుంచి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. విషయం తెలిసి హయత్‌నగర్ సీఐ నరేందర్‌గౌడ్ ఘటనా స్థలానికి వచ్చారు. యువతితో మాట్లాడిన ఆయన గ్రామసర్పంచ్ సమక్షంలో కుటుంబ సభ్యులంతా కలిసి మాట్లాడుకొని సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా, ప్రియురాలి ఆందోళన విషయం తెలిసి ప్రియుడు సుధీర్‌రెడ్డి రహస్య ప్రాంతంలో తలదాచుకోవడం గమనార్హం. -
ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి ధర్నా
కొత్తూరు (మహబూబ్‌నగర్ జిల్లా) : ఐదేళ్లుగా ప్రేమించి తీరా పెళ్లి అనే సరికి ముఖం చాటేసిన ప్రియుడి ఇంటి వద్ద ప్రియురాలు ధర్నాకు దిగింది. ఈ సంఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం కోడిచర్ల గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. కొత్తూరు మండలంలోని పెంచర్లకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని, అదే మండలం కోడిచర్ల గ్రామానికి చెందిన ఎమ్ఎ విద్యార్థి శ్రీనివాస్ గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె.. శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకోవాలని కోరింది. దీంతో ప్రియుడు ముఖం చాటేశాడు. ఆగ్రహించిన ఆమె.. ప్రియుడి స్వగ్రామం కోడిచర్లలో అతని ఇంటి ఎదుటే ధర్నాకు దిగింది. కాగా విద్యార్థినికి పలువురు నాయకులు మద్ధతుగా నిలిచారు. ప్రేమ పేరుతో మోసం చేసిన శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.