
బాపట్ల: ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడు మరో వివాహానికి సిద్ధమయ్యాడని ప్రియురాలు మౌన దీక్ష చేపట్టింది. బాపట్ల పట్టణంలోని రాజీవ్‌గాంధీ కాలనీకి చెందిన నాగార్జున అనే యువకుడు తనను ప్రేమ పేరుతో మోసం చేసి మరో వివాహానికి సిద్ధమౌతున్నాడని కృష్ణాజిల్లాకు చెందిన నాగజ్యోతి అనే యువతి దీక్ష చేపట్టింది. విజయవాడలో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ ఐదేళ్ళుగా ప్రేమించుకుంటున్నామని నాగజ్యోతి వివరించింది.
ఇటీవల హైదరాబాద్‌కు మకాం మార్చిన నాగార్జున తనను దూరంగా పెట్టి మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడని తెలిపింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని, వివాహం కోసం ఒప్పించేందుకు బాపట్లకు వస్తే కనిపించకుండా వెళ్ళిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనను వివాహం చేసుకునే వరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేసింది.
చదవండి: తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు..
గ్రామాల వైపు.. గజరాజుల చూపు!
Comments
Please login to add a commentAdd a comment