![married woman dharna in Lover House front - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/17/658.jpg.webp?itok=TVkMfjgw)
నల్గొండ : తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన ప్రియుడు మోసం చేశాడంటూ వివాహిత రోడ్డుపై ధర్నా చేపట్టింది. ఈ ఘటన వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన తరికొప్పుల శిరీష, ఆమనగల్లుకు చెందిన మహేష్ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
వీరి ప్రేమ విషయం శిరీష ఇంట్లో తెలియడంతో ఐదేళ్ల క్రితం ఆమెకు కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో వివాహం చేశారు. అయినప్పటికీ శిరీష, మహేష్ మధ్య ప్రేమ కొనసాగుతూనే వచ్చింది. శిరీష విడాకులు తీసుకుంటే తాను వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె తన భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమెతో పెళ్లికి మహేష్ నిరాకరిస్తున్నాడు.
ఈ విషయమై పెద్ద మనుషులను ఆశ్రయించినప్పటికీ పట్టించుకోకపోవడంతో శనివారం మహేష్ స్వగ్రామమైన ఆమనగల్లుకు శిరీష చేరుకొని తనను పెళ్లి చేసుకోవాలని భీమారం–సూర్యాపేట రహదారిపై ధర్నా చేపట్టింది. అయితే శిరీష తన భర్తతో లీగల్‌గా విడాకులు తీసుకోలేదని, ఆమెకు మూడేళ్ల వయస్సు గల కుమారుడు ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment