వాలెంటైన్స్‌డేకు నిరసనగా హైదరాబాద్ వ్యాప్తంగా భజరంగదళ్ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
హైదరాబాద్: వాలెంటైన్స్‌డేకు నిరసనగా హైదరాబాద్ వ్యాప్తంగా భజరంగదళ్ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కోఠి, అబిడ్స్, వైఎంసీఏ సర్కిల్‌లతోపాటూ మరిన్ని ప్రాంతాల్లో భజరంగ్‌దళ్ కార్యకర్తలు వాలెంటైన్స్ డే గ్రీటింగ్‌లు, వాలెంటైన్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు.
ఆందోళన చేస్తున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నెలకొన్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలోని పార్క్‌లు, రద్దీ ప్రాంతాలు, ప్రేమికులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.