
జస్ట్ అలా అలవోకగా కన్ను కొట్టి కుర్రకారు హృదయాలను దోచేసుకున్నారు మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. లక్షల మంది కుర్ర హృదయాలను కొల్లగొట్టేసిన ఈ కన్నుకొట్టుడు పిల్ల నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ ‘లవర్స్ డే’ మూవీని విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రొమాంటిక్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘ఏంటి?.. ఏమీ లేదు.. ఏమీ లేదా!.. ఇది చెప్పడానికేనా నన్ను రమ్మన్నావు.. అది మన మధ్య.. మన ఇద్దరికీ ఇంత త్వరగా సెట్ అవుతుందని నేను అనుకోలేదు.. అయ్యా..సెట్ అయిందా ఏంది సెట్ అయింది. మరి నిన్న నాకు ఎందుకు సైట్ కొంటావ్.. నేనా’ అంటూ రోషన్, ప్రియా వారియర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినీ ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. షాన్ రెహమాన్ అందించిన బ్యాగ్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.ఈ చిత్రానికి ఒమర్ లులు దర్శకత్వం వహించారు. సుఖీభవ సినిమాస్ పతాకంపై ఎ.గురురాజ్, సి.హెచ్. వినోద్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment