సోషల్ మీడియా సెన్సేషన్, కేరళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా తెలంగాణ, మహారాష్ట్రల్లో నమోదైన కేసులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఆమె నటించిన మలయాళ సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ లోని పాటపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోలీస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో దేశంలో ఎక్కడా కూడా నటి ప్రియపై, సినిమా దర్శక, నిర్మాతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది.