తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్’. నాట్ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 23నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా రిలీజ్‌కు బ్రేక్ పడింది. తాజాగా థియేటర్లు తెరుచుకున్న కారణంగా ఈ నెల 30న థియేటర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది.
కాగా చెల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. జాంబిరెడ్డితో హిట్ ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి హనుమాన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment