
ఒక్క కన్నుగీటుతో రాత్రి రాత్రే స్టార్‌గా మారిన ప్రియా ప్రకాశ్ వారియర్ మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వరుసగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలో రెడ్ షర్ట్, జీన్స్ ధరించి.. కళ్లద్దాలతో స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాదు ఈసారి తన సిగ్నేచర్ మార్క్‌తో కాకుండా.. ఫ్లైయింగ్ కిస్‌తో నెటిజన్లకు గిలిగింతలు పెట్టింది. అదే విధంగా తన కో-స్టార్ రోషన్ అబ్దుల్ రహూఫ్‌తో కలిసి ఓ మలయాళ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఫొటోషూట్‌కు సంబంధించిన విశేషాలను కూడా అభిమానులతో పంచుకుంది. కాగా ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్‌తో ఆమె నటించిన తొలి సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. మలయాళంలో రూపొందిన ఈ చిత్రాన్ని మాతృభాషలోనే కాకుండా చాలా తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేశారు. అయితే కథలో అంతగా బలం లేకపోవడంతో ఈ మూవీ పూర్తిగా నిరాశ పరిచింది. అయినప్పటికీ ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మోడలింగ్, వాణిజ్యప్రకటనలతో తనదైన శైలిలో దూసుకుపోతోంది. అయితే సినిమాల విషయానికొస్తే ఆమెకు తగినన్ని అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. ప్రియా ప్రధాన పాత్రలో నటించిన ‘శ్రీదేవి బంగ్లా’ వివాదాస్పదంగా మారడంతో.. ఆ సినిమా ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment