
రోహిత్ నందన్, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నో ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం ‘లడిలడి’ అనే పాట రూపొందింది. శ్రీచరణ్ పాకాల స్వరాలు అందించగా, ‘బిగ్ బాస్ 3’ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ రచించిన ఈ పాటకు రఘు మాస్టర్ డ్యాన్స్ సమకూర్చారు. ఈ పాటని ఇటీవల విడుదల చేశారు. రోహిత్ నందన్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుని డ్యాన్స్, నటనలో శిక్షణ తీసుకున్నాను. లాక్ డౌన్ సమయంలో నా స్నేహితుడు శ్రీచరణ్ పాకాలతో కలిసి ఈ ‘లడిలడి’ అనే పాట చేయాలనుకున్నాను. ఈ పాట ద్వారానే ప్రియా ప్రకాశ్ వారియర్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆమె ఈ పాటలో డ్యాన్స్ చేయడమే కాదు.. పాడటం విశేషం. తొలిసారి నేను చేసిన ఈ ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం, యూట్యూబ్‌లో మిలియన్‌కిపైగా వ్యూస్ రావడం చాలా ఆనందంగా ఉంది. నేను త్వరలోనే హీరోగా ఓ ప్రముఖ దర్శకుడితో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment