![Priya Prakash Varrier with White Hair, Photos Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/29/priya-prakash-varrier.jpg.webp?itok=AejBzL7L)
ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈమె కన్ను కొట్టే స్టైల్‌కు దేశమే ఫిదా అయింది. కరోనా సమయంలో ఈ కన్ను కొట్టే సీన్ ఎంతగానో వైరల్ అయింది. ఒరు ఆదార్ లవ్ సినిమాలో ఉన్న ఈ ఒక్క సీన్‌తో ఆమె ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా ఈ కేరళ కుట్టి తెలుగులో ఇష్క్, చెక్ సినిమాలు చేసింది. తెలుగులోనే కాదు మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయింది.
ప్రస్తుతం హిందీలోనే నాలుగు చిత్రాలు చేస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో రకరకాల ఫోటోషూట్లతో అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోంది. తాజాగా ఆమె పింక్ చుడీదార్‌లో ట్రెడిషనల్‌గా రెడీ అయిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ప్రియా నెత్తిన ఉన్న తెల్లజుట్టును నెటిజన్లు ఇట్టే పసిగట్టారు. అప్పుడే నీకు తెల్లజుట్టు వచ్చిందా? అని షాకవుతున్నారు. ఆమె అభిమానులు మాత్రం జుట్టు తెల్లబడటం సాధారణమేగా.. తను వాటిని దాచకుండా సహజంగా కనిపించేందుకు ప్రయత్నించింది, ఇందులో తప్పేముంది అని వెనకేసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment