మలయాళీ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లో కన్నుగీటే సన్నివేశంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నటి ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో క్లిప్‌లో ఈ భామ కను సైగలతో చేసిన హావభావాలు అందర్నీ కట్టి పడేశాయి. టాలీవుడ్ హీరోల నుంచి సౌతాఫ్రికా క్రికెటర్ లుంగీ ఎంగిడీ వరకూ ప్రియాకు ఫ్యాన్స్ అయ్యారు. ఇపుడామే తనకు వచ్చిన స్టార్‌డమ్ ను ఎంజాయ్ చేస్తోంది.
తాజాగా ప్రియ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఐఎస్ఎల్-2018కు తన సహనటుడు రోషన్ అబ్దుల్ రవూఫ్‌తో కలిసి హాజరైంది. ఇందులో భాగంగా అక్కడే ఉన్న మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్, అభిషేక్ బచ్చన్ ను కలిసింది. ఈ సందర్భంగా సచిన్‌ను కలుసుకున్న ఫొటోను ప్రియా ట్విటర్‌లో షేర్ చేసింది. ‘ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు నేను ఇద్దరు గొప్ప వ్యక్తులను కలుసుకున్నాను’ అంటూ పోస్ట్ చేసింది.
సచిన్‌తో ప్రియా వారియర్, రోషన్ అబ్దుల్ రవూఫ్
Comments
Please login to add a commentAdd a comment