
ప్రియా ప్రకాశ్, చంద్రశేఖర్ యేలేటి, నితిన్, ఆనంద్ ప్రసాద్, సుధాకర్ రెడ్డి
కెరీర్ ట్రాక్‌లో స్పీడ్ గేర్ వేశారు నితిన్. ఇటీవలే ‘భీష్మ’ షూటింగ్‌ను షురూ చేసిన నితిన్ తన తర్వాతి చిత్రానికి ఆదివారం కొబ్బరికాయ కొట్టారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు.
ముహూర్తపు సన్నివేశానికి వి. ఆనంద ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నితిన్ కెరీర్‌లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా ఉంటుంది. చంద్రశేఖర్ యేలేటిగారు తీసుకున్న పాయింట్ గొప్పగా, వైవిధ్యంగా ఉంటుంది. కీరవాణిగారి సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. షూటింగ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు. కాగా కృష్ణచైతన్య దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు నితిన్.
Comments
Please login to add a commentAdd a comment