Reason Behind Why Priya Prakash Varrier Forced to Sit Outside the Hotel, Details Inside - Sakshi
Sakshi News home page

Priya Prakash Varrier: హోట‌ల్‌లో హీరోయిన్‌కు చేదు అనుభ‌వం

Published Wed, Jan 26 2022 12:37 PM | Last Updated on Wed, Jan 26 2022 1:29 PM

Priya Prakash Varrier Called Out Hotel for Making Her Sit Outside the Premises to Eat Her Food - Sakshi

ఒక్క వీడియో ఆమె జీవితాన్నే మార్చేసింది. 'ఒరు ఆడార్ ల‌వ్' సినిమాలో క‌న్ను కొట్టే సీన్‌తో ప్రియా వారియ‌ర్ దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయింది.. వింక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ కేర‌ళ కుట్టి ప‌లు తెలుగు సినిమాల్లో న‌టిస్తోంది. తాజాగా ఆమెకు ఓ హోట‌ల్‌లో చేదు అనుభ‌వం ఎదురైంది. ఈ విష‌యాన్ని ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చెప్పుకొచ్చింది.

'ఫెర్న్ గొరెగావ్ హోట‌ల్‌లో నేను బ‌స చేశాను. ఈ హోట‌ల్ పాల‌సీ ఏంటంటే.. బ‌య‌ట ఫుడ్‌ను లోనికి అస్స‌లు అనుమ‌తించ‌రు. ఎందుకంటే అతిథులు ఎవ‌రైనా ఫుడ్ ఆర్డ‌ర్ చేస్తే వాళ్ల‌కు ఎక్కువ డ‌బ్బులు వ‌స్తాయి. నాకీ సంగ‌తి తెలియ‌దు. షూటింగ్ నుంచి తిరిగి వ‌చ్చేట‌ప్పుడు దారిలో ఫుడ్ కొనుక్కుని హోట‌ల్‌కు వ‌చ్చాను. ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏంటంటే? హోట‌ల్‌ బుకింగ్, రిజిస్ట్రేష‌న్‌.. అన్నీ ప్రొడ‌క్ష‌న్ కంపెనీ వాళ్లే చేస్తారు, ఆర్టిస్టుల‌కు సంబంధం ఉండ‌దు'

'నేను ఎంతో మ‌ర్యాద‌గా వారిని వేడుకున్నా.. ఈ ఒక్క‌సారికి వ‌దిలేయండి.. ఎందుకంటే డ‌బ్బులు పెట్టి ఫుడ్ కొన్నాను, పైగా నాకు దాన్ని పారేయ‌డం ఇష్టం లేదు అని! కానీ వాళ్లు వినిపించుకుంటేగా.. ఆ ఫుడ్‌ను బ‌య‌టే వ‌దిలేయాలంటూ పెద్ద సీన్ చేశారు. క‌నీసం నేను చెప్పేది వినిపించుకోవ‌డానికి కూడా ప్ర‌య‌త్నించ‌లేదు. చాలా అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించారు.. దీంతో బ‌య‌ట చలిలో భోజ‌నం చేయాల్సి వ‌చ్చింది' అని చెప్పుకొచ్చిందీ ప్రియా వారియ‌ర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement