
Fan of Ram Gopal Varma Started Food Business On His Name: అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చాటుకుంటారు. కొందరు ఫ్లెక్సీలు కట్టి, పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకుంటే, మరికొందరేమో టాటూలు వేయించుకొని సంబరపడతారు. కానీ తాజాగా ఓ అభిమాని మాత్రం తన ఫేవరెట్ సెలబ్రిటీ పేరు మీద ఏకంగా హౌటల్ పెట్టుకొని ఫేమస్ అయ్యాడు. ఇంతకీ అతను ఎవరి అభిమానో తెలుసా?.. తరచూ వివాదాలు, సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి వీరాభిమాని.
అతని తల్లి, సోదరుడు ఇలా ఇంటిల్లిపాది రామ్‌గోపాల్ వర్మకు అభిమానులే. ఆయన ఫిలాసఫీకు ఫిదా అయినవారే. ఆ అభిమానంతోనే ఆర్జీవీ పేరుతో హోటల్ పెట్టారు. హోటల్ నిండా ఆర్జీవీ చెప్పిన కొటేషన్లు, ఫోటోలు, పోస్టర్లే కనిపిస్తాయి. రామ్ గోపాల్ వర్మ పుణ్మమా అని వ్యాపారం కూడా బాగా నడస్తుందట. త్వరలోనే మరిన్ని బ్రాంచ్‌లు కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట.
కాగా తన పేరు మీద హోటల్ ఏర్పాటు చేయడంపై ఆర్జీవీ సైతం స్పందించాడు. నా పేరుతో హోటల్ ఉందంటే చచ్చిపోయినట్లు అనిపిస్తుంది అని తనదైన స్టైల్‌లో ట్వీట్ చేశాడు. ఇక ఆర్జీవీ పేరుతో ఉన్న హోటల్ స్థానికంగా తెగ పాపులర్ అవుతుంది. అక్కడి వంటకాలను రుచి చూడాలనుకుంటే మాత్రం మీరు తూర్పు గోదావరి జిల్లా బెండమూర్లంక గ్రామానికి వెళ్లాల్సిందే.