Priya Prakash Varrier claims 'wink' was her idea, Director Omar Lulu suggests medicine for 'memory loss' - Sakshi
Sakshi News home page

Priya Prakash Varrier: కన్నుకొట్టే సీన్ నాదే.. ప్రియా వారియర్‌కు డైరెక్టర్ చురకలు!

Published Wed, Jun 7 2023 9:27 PM | Last Updated on Thu, Jun 8 2023 9:44 AM

Director Omar Lulu suggests medicine for memory loss Priya Prakash Varrier - Sakshi

ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక్క సీన్‌తో ఓవర్‌ నైట్ స్టార్‌ అయిపోయింది.  2019లో విడుదలైన ‘ఓరు అదార్‌ లవ్‌’ చిత్రంలో కన్ను కొట్టిన సీన్(వైరల్‌ వింక్‌) మీకు గుర్తుందా? ఆ ఒక్క సీన్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై చిత్ర దర్శకుడు ఓమర్‌ లూలూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

(ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!)

అసలేం జరిగిందంటే.. 

'ఓరు అదార్‌ లవ్‌' చిత్రంలో కన్ను కొట్టే ఐడియా తనదేనంటూ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలను దర్శకుడు ఫన్నీగా కొట్టి పారేశారు. ఒమర్ లులు తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి  ప్రియా ప్రకాష్ వారియర్ ఇంటర్వ్యూల వీడియో క్లిప్‌ను పంచుకున్నారు.

ఇన్‌స్టాలో రాస్తూ.. ' పాపం పిచ్చిపిల్ల.. ఐదేళ్ల క్రితం ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయినట్టుంది. వలియ చందనాది.. జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది.' అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. అయితే ప్రియా ప్రకాశ్ వారియర్ డైరెక్టర్ చేసిన కామెంట్స్‌పై స్పందించలేదు. 

కాగా.. ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఒరు అదార్ లవ్ సినిమాలోని ఈ సాంగ్ యూట్యూబ్‌లో 107 మిలియన్ల వ్యూస్ సాధించింది.  ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, నూరిన్ షెరీఫ్, రోషన్ అబ్దుల్ రహూఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

(ఇది చదవండి: డింపుల్ హయాతి వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement