బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్‌గా అగ్ర హీరోల సరసన మెప్పించింది. అప్పట్లో ప్రపంచ సుందరిగా కిరీటం దక్కించుకున్న బాలీవుడ్ భామ ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీగా ఉంది. ఇటీవలే ఆమె నటించిన సిటాడెల్ వెబ్‌సిరీస్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా సిటాడెల్ ప్రమోషన్లలో పాల్గొన్న ప్రియాంక పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శృంగారం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాజా ఇంటర్య్వూలో ఫస్ట్ డేట్‌లోనే మీరు శృంగారానికి ఒప్పుకుంటారా అని ప్రశ్నించగా.. షాకింగ్ సమాధానం ఇచ్చింది. ఫస్ట్ డేట్‌లోనే శృంగారానికి ఒప్పుకుంటానని తెలిపింది. దీనివల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతుందని. భవిష్యత్‌లో మనతో ఎలా ఉంటాడో అనే విషయాలు తెలుస్తాయంటూ మనసులోని భావాలను బయటపెట్టింది.
(ఇది చదవండి: కీర్తి సురేశ్ కాబోయే భర్త ఎవరో తెలుసా?.. వైరలవుతున్న ఫోటో!)
పెళ్లికి ముందు ప్రియాంక చోప్రా చాలా మందితో డేటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఆ బంధాలు ఎక్కువ కాలం నిలవలేదని తెలిపింది. దీంతో రిలేషన్‌షిప్స్ వెంట వెంటనే మారాయని వెల్లడించింది. ఇండస్ట్రీలోని గొప్ప వ్యక్తులతో డేటింగ్ చేశానని పేర్కొంది. ఆ తర్వాత ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్, నటుడు నిక్ జోనస్‌తో ప్రేమాయణం కొనసాగించింది.
కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట పెద్దలను ఒప్పించి 2018లో పెళ్లి చేసుకుంది. ప్రియాంక చోప్రా గతేడాది సరోగసి విధానంలో ఒక పాపకు కూడా జన్మనిచ్చింది. ఇటీవలే తన బిడ్డతో కలిసి ఇండియాలో కూడా పర్యటించింది. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌లో చాలా బోల్డ్‌గా కనిపించింది. శృంగార సన్నివేశాల్లో నటించేటపుడు కాస్త ఇబ్బంది పడినట్లు ప్రియాంక చెప్పుకొచ్చింది.
(ఇది చదవండి: అగ్రహీరోల సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్‌లో ఉండేలా ప్లాన్!)
Comments
Please login to add a commentAdd a comment