మలయాళీ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లో కన్నుగీటే సన్నివేశంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నటి, సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా ప్రకాశ్ వారియర్(18) మరోసారి వార్తల్లో నిలిచింది. ఫాలోయర్లలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్‌బర్గ్‌నే మించిపోయింది ఈ కేరళ నటి. ఇన్‌స్టాగ్రామ్ సంస్థ యజమాని జూకర్‌బర్గ్‌కు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లు 4 మిలియన్లు (40 లక్షల మంది) ఉండగా, ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే సెలబ్రిటీగా మారిన ప్రియా ప్రకాశ్ కు 4.5 మిలియన్లు (45 లక్షల మంది) ఫాలోయర్లు ఉండటం గమనార్హం.
ఒక్క కన్ను కొట్టి కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్న కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. ఒరు ఆదార్ లవ్’ మళయాళ చిత్రంలోని పాట ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాందించుకుంది. రోజురోజుకి ఈ అమ్మడిని ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరుగుతూ వస్తుంది. ఫాలోవర్స్ పరంగా ఇప్పటికే సన్నీలియోన్, కత్రినా కైఫ్ వంటి సెలబ్రిటీలని క్రాస్ చేసిన ప్రియా వారియర్ తాజాగా ఫేస్‌బుక్ సృష్టికర్త జుకర్‌బర్గ్‌ని మించిపోయింది. ఆయనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే, ఈ 18 ఏళ్ళ కేరళ కుట్టికి 4.5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఏదైన ఫోటో పోస్ట్‌చేసిన లేదంటే వీడియో అప్‌లోడ్ చేసిన మిలియన్స్‌కి పైగా లైకులు, వ్యూస్ వస్తున్నాయి. సోషల్ మీడియా సంచలనంగా మారిన ప్రియా రోజురోజుకి ఎవరికి అంతనంత ఎత్తుకి ఎదుగుతుంది. ఈ అమ్మడికి పలు సినిమాలలో ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి. టాలీవుడ్‌లో నిఖిల్ సరసన నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుండగా , దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
‘ఒరు అదార్ లవ్’లో ఒక్క సీన్లో కన్ను కొట్టి కోట్లాది అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన ప్రియా వారియర్ రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన విషయం తెలిసిందే. ఫాలోయర్స్ పరంగా బాలీవుడ్ హీరోయిన్లు కత్రినా కైఫ్, సన్నీలియోన్ లను దాటేస్తూ పోతున్న ఈ కేరళ బ్యూటీ ఇన్‌స్ట్రాగ్రామ్ ఫాలోయర్లలో ఏకంగా ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ నే మించిపోయింది. రోజురోజుకి ఈ నటిని ఫాలో అయ్యే వారి సంఖ్య అమాంతం పెరిగి పోతుండటంతో రోజుల వ్యవధిలోనే పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది. జూకర్‌బర్గ్ పోస్ట్ చేసిన వీడియో, ఫొటోలకు నాలుగైదు లక్షల వరకు కామెంట్స్, లైక్స్ వస్తుండగా.. ప్రియా వారియర్ ఒక్కో పోస్ట్‌కు పది లక్షలకు పైగా లైక్స్, కామెంట్స్ రావడం గమనార్హం. మరోవైపు తొలి సినిమా ఇంకా విడులవ్వక ముందే వరుస సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment