Threads: Mark Zuckerberg's Meta Twitter-killer is here; you must know - Sakshi
Sakshi News home page

ఎలాన్‌ మస్క్‌కు భారీ షాక్‌.. ట్విటర్‌ పోటీగా మెటా ‘థ్రెడ్’.. ఫస్ట్ లుక్ ఇదే

Published Tue, Jul 4 2023 9:45 AM | Last Updated on Tue, Jul 4 2023 10:06 AM

Mark Zuckerberg Launch Twitter Alternative App Threads - Sakshi

Instagram Threads : యూజర్లు చూసే ట్వీట్‌లపై ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, మస్క్‌ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న యూజర్లు ట్విటర్‌కు ప్రత్యామ్నాయమైన బ్లూ స్కై, మాస్టోడాన్‌ లాంటి మైక్రోబ్లాగింగ్‌ యాప్స్‌ను వినియోగించేందుకు మక్కువ చూపుతున్నారు.

ఈ తరుణంలో మస్క్‌ను మరింత ఇబ్బందుల్లో నెట్టేలా మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ‘థ్రెడ్‌’ పేరుతో  ట్విటర్‌ తరహా మైక్రో బ్లాగింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ యాప్‌ను జులై 6న విడుదల చేయనున్నారు. ఈ యాప్‌ విడుదల తేదీపై స్పష్టత లేనప్పటికీ.. థ్రెడ్‌ యాప్‌ వివరాలు గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.      

థ్రెడ్‌ యాప్‌ విడుదల తర్వాత ఇన్‌స్ట్రాగ్రామ్‌ యూజర్లు వారి ఇన్‌స్టా ఐడీతో ఈ మైక్రోబ్లాగింగ్‌ యాప్‌లో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుందంటూ ప్లేస్టోర్‌లో కనిపిస్తున్న థ్రెడ్‌ యాప్‌లో లాగిన్‌ వివరాలు ఉన్నాయి.   

ఇప్పటికే ఈ యాప్‌ గురించి సంస్థ ఉద్యోగులతో మెటా చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ క్రిస్ కాక్స్ ప్రివ్యూ మీటింగ్‌ నిర్వహించారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. థ్రెడ్‌ కోసం డీసెంట్రలైజ్డ్‌ సోషల్‌ మీడియా ప్రోటోకాల్‌ సంస్థ యాక్టివిటీపబ్‌తో మెటా చేతులు కలిపింది. ఈ సంస్థ వెబ్‌ సర్వర్‌లకు - వెబ్‌బ్రౌజర్‌లు థ్రెడ్‌ యాప్‌ ఇంటర్‌ ఫేస్‌కు అనుసంధానం చేసేలా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ యాప్‌ ఇంటర్నల్‌ కోడ్‌ నేమ్‌ ‘ప్రాజెక్ట్ 92’ అని తెలుస్తోంది.

చదవండి👉 ఎలాన్‌ మస్క్‌కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement