మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ 'మెటా' (Meta) 2024 నుంచి యాడ్-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను యాడ్స్ లేకుండా వినియోగించాలనుకుంటే తప్పకుండా డబ్బు చెల్లించాల్సిందే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అంటూ కంపెనీ కూడా ప్రకటించింది. అయితే యాడ్స్ వచ్చినా వినియోగించుకోవచ్చు అనుకునేవారు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.
కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం ప్రవేశపెట్టడానికి సంస్థ సన్నద్ధమవుతోంది. ట్రయల్ తరువాత అధికారికంగా 2024 మధ్యలో గానీ లేదా ఆ సంవత్సరం చివరి నాటికి గానీ అమలులోకి రానున్నట్లు సమాచారం.
ఇప్పటికే వినియోగదారుని అనుమతి లేకుండా ప్రకటనలు పంపినందుకు ఐర్లాండ్ ప్రైవసీ కమీషన్ మెటాకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రకటనలు పంపించాలంటే తప్పకుండా యూజర్ అనుమతి అవసరం అనే రీతిలో యాడ్-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ విధానం తీసుకువచ్చింది.
ఇదీ చదవండి: ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు ఆస్తి ఎన్ని కోట్లంటే?
ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత యూజర్ యాడ్-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు ఇన్‌స్టాగ్రామ్ 14 డాలర్లు, ఫేస్‌బుక్ 17 డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. దీనికి సంబందించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. ప్రారంభంలో ఫ్రీ అన్న జుకర్‌బర్గ్ ఇప్పుడు ఎక్స్ (ట్విటర్) బాటలో పయనించడానికి సిద్దమవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment