Phhhoto Filed an Antitrust Suit Against Meta: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (మెటా)కు భారీ షాక్ తగిలింది. ఫేస్‌బుక్‌పై ఫోటో యాప్ సంస్థ 'ఫోటో'(Phhhoto) కోర్ట్‌ను ఆశ్రయించింది. తమ యాప్‌కు చెందిన క్లోనింగ్ ఫీచర్ ను కాపీ కొట్టి ఫేస్‌బుక్..ఇన్ స్ట్రాగ్రామ్‌లో వినియోగిస్తుందంటూ కోర్ట్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు తమకు ఫేస్‌బుక్ అధినేత మార్క్‌జుకర్ బర్గ్ నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తోంది. దీంతో వరుస పరిణామాల నేపథ్యంలో తాజాగా ఫోటో యాప్ సైతం కోర్ట్‌లో ఫిర్యాదు చేయడం..ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ పరిస్థితి 'మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు' అయ్యిందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఫోటో యాప్
ఫోటో యాప్ యూజర్లు ఒకే పాయింట్-అండ్-షూట్ బరస్ట్‌లో ఐదు ఫ్రేమ్‌లను క్యాప్చర్ చేయడానికి, చిన్న జిఫ్ వంటి వీడియోల్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే తన ఫీచర్‌ను ఫేస్‌బుక్ కాపీకొట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అయిన 'బూమ్‌రాంగ్' ఫీచర్‌లో వినియోగిస్తుందని అమెరికన్ డిస్ట్రిక్ కోర్ట్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వినియోగిస్తున్న ఫీచర్ ఎంత పాపులర్ అయ్యిందో మాకు బాగా తెలుసు. కానీ ఈ ఫీచర్ ఆలోచన ఫేస్‌బుక్‌ది కాదు. ఫేస్‌బుక్..ఫోటో ఫీచర్‌ను కాపీ చేసి బూమ్ రాంగ్ గా ఇన్ స్ట్రాగ్రామ్ యూజర్లకు అందించింది. అదే సమయంలో దివెర్జ్ కథనం ప్రకారం..ఇన్‌స్ట్రాగ్రామ్ ఏపీఐ నుంచి ఫోటోని ఫేస్‌బుక్ బ్లాక్ చేసిందని కంపెనీ ఆరోపిస్తుంది.
ఫేస్‌బుక్ ఎవరిని ఎదగనీయదు
ఫేస్‌బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ కారణంగా తన సంస్థ బిజినెస్ పరంగా భారీగా దెబ్బతిన్నదని, పెట్టుబడులు పెట్టే అవకాశాల్ని నాశనం చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు మండిపడ్డారు. ఫేస్‌బుక్‌కు పోటీగా వస్తున్న ఏ సోషల్ మీడియా నెట్ వర్క్‌లను ఎదగనీయదని, ఫేస్‌బుక్ తీరు వల్లే ఫోటో నష్టపోయిందని ఫోటో ప్రతినిధులు కోర్ట్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
2017లో షట్ డౌన్
ఫోటో యాప్ 2014లో ప్రారంభమైంది. కానీ యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో ఆ సంస్థ ప్రతినిధులు 2017లో షట్‌డౌన్ చేశారు. అయితే ఈ ఫోటో యాప్ ప్రారంభంలో నెలవారి యూజర్లు 3.7 మిలియన్ల మంది వినియోగించుకున్నారని, వారిలో బియాన్స్, జో జోనాస్, క్రిస్సీ టీజెన్, బెల్లా హడిద్ లు ఉన్నట్లు తెలిపారు. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఇన్‌స్టాగ్రామ్ మాజీ సీఈవో కెవిన్ సిస్ట్రోమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి దాని ఫీచర్లను పరిశీలించినట్లు నివేదిక పేర్కొంది. కాగా, ఫోటో సంస్థ ప్రతినిధులు ఫేస్‌బుక్ పై ఫిర్యాదు చేయడంపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. ఫోటో అర్ధం లేని ఆరోపణలు చేస్తుందని, కోర్ట్‌లో వేసిన పిటిషన్ పై న్యాయమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
చదవండి: జుకర్ బర్గ్‌పై మరో పిడుగు..! ఈ సారి మైక్రోసాఫ్ట్ రూపంలో..!
Comments
Please login to add a commentAdd a comment