
ఒకే ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిన అందాల భామ ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళ సినిమా ఒరు ఆదార్ లవ్ (తెలుగులో లవర్స్ డే) సినిమాలో కన్ను గీటే సీన్‌తో పాపులర్ అయిన ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో తెగ క్రేజ్ ఉంది. కుర్రకారును పిచ్చెక్కిచ్చే ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చూస్తూ వారిని అలరిస్తుంటారు. దీంతో ఇన్‌స్టాలో 7.2 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించారు ప్రియా. ఫోటో లేక వీడియో పెట్టడం ఆలస్యం క్షణాల్లోనే వేలల్లో లైకులు, లక్షల్లో వీక్షణలు వస్తుంటాయి. ఈ మధ్యే టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ పలు వీడియోలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.
అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ హఠాత్తుగా అభిమానులకు షాక్‌కు గురిచేస్తూ ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకున్నారు. కొందరు తనను పనికట్టుకొని ట్రోల్‌కు గురిచేస్తున్నారనే అసహనంలో ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం కొద్ది రోజులు మాత్రమే సోషల్ మీడియాకు దూరంగా ఉంటానిని, త్వరలోనే తిరిగి వస్తానని సన్నిహితువద్ద పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ మలయాళ బ్యూటీ ఇన్‌స్టా నుంచి ఎందుకు తప్పుకుంటున్నారో అధికారికంగా తెలియనప్పటకీ ఈ నిర్ణయంతో ఆమె అభిమానులు మాత్రం కలవరపడుతున్నారు.
చదవండి:
‘సమరసింహారెడ్డి’ మళ్లీ రిపీట్ అవుతుందా?
అదిరేటి లుక్‌లో మహేశ్.. సినిమా కోసమేనా?
Comments
Please login to add a commentAdd a comment