ఇటీవల సక్సెస్ విషయంలో కాస్త తడబడుతున్న యంగ్ హీరో నాని వరుసగా రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని, తరువాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
తాజాగా నాని, విక్రమ్‌ల సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్లో హల్‌చల్ చేస్తోంది. ఇటీవల ఒక్క కంటి సైగతో సోషల్ మీడియాను ఊపేసిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందట. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment