
ప్రియా ప్రకాష్ వారియర్
కన్ను గీటి ఆన్‌లైన్‌లో బాగా పాపులర్ అయ్యారు మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’లో కన్ను కొట్టే సన్నివేశం ప్రియా ప్రకాష్‌ను దేశవ్యాప్తంగా పాపులర్ చేసింది. తాజాగా ప్రియా వారియర్ సింగర్‌గా మారారు.
ఓ హిందీ మ్యూజిక్ వీడియోలో నటించి, ఆ పాటను ఆలపించారామె. అశోకన్ పి. దర్శకత్వం వహించిన ఈ మ్యూజిక్ వీడియో త్వరలోనే విడుదల కానుంది. ఈ పాట టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. క్రిస్టస్ స్టీఫెన్ సంగీతం అందించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే ఈ మ్యూజిక్ వీడియోను షూట్ చేశామని టీమ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment