
ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్న మలయాళీ కుట్టి. . కేవలం 30 సెకండ్స్ వీడియోలో కన్నుకొట్టి దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది. అప్పట్లో ఈ వీడియో పై ఎన్నో వేల ట్రోల్స్ వచ్చాయి. ఈమె నటించిన 'ఒరు ఆడార్ లవ్' ఫ్లాప్ అయినా ప్రియాకు మాత్రం ఆ సినిమా విడుదలకు ముందే మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ సినిమా ప్లాప్ వల్ల ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు దక్కలేదు.
శ్రీదేవి బంగ్లా అంటూ హిందీలో ఒక సినిమా చేసినా అది విడుదల కాలేదు. ప్రస్తుతం తెలుగులో నితిన్, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతోన్న 'చెక్' చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుంది. అంతకు మించి ఈ మలయాళీ కుట్టి దగ్గర ప్రస్తుతం ఎలాంటి సినిమాలు లేవు. కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో తన రూట్ మార్చుకుని తనలోని కొత్త టాలెంట్‌ను బయటపెట్టేందుకు రెడీ అవుతోందట. హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో తనలో ఉన్న గాయనిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అవుతుండట. సింగర్‌గా అవతారమెత్తి ప్రేక్షకులను మనసును దోచుకునే పనిలో బీజీగా ఉందట. ఈ క్రమంలోనే శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకత్వంలో ఓ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్ పాట పాడిందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో విడుదల కానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment