చివరి షెడ్యూల్లో చెక్‌ | Nithin check movie first schedule completed | Sakshi
Sakshi News home page

చివరి షెడ్యూల్లో చెక్‌

Published Sun, Oct 18 2020 2:56 AM | Last Updated on Sun, Oct 18 2020 2:56 AM

Nithin check movie first schedule completed - Sakshi

నితిన్‌ హీరోగా రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘చెక్‌’. వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యేలేటి చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నూతన షెడ్యూల్‌ ఈ నెల పదో తేదీన హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘చదరంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ‘చెక్‌’ అని టైటిల్‌ పెట్టడంతో అన్ని వర్గాల నుండి చక్కని స్పందన వచ్చింది. వచ్చే నెల 5వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తవుతుంది. ప్రస్తుతం నితిన్, రకుల్‌ప్రీత్, సంపత్‌రాజ్, సాయిచంద్‌లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement