

ఓవర్‌నైట్‌లో స్టారైన మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ మరోసారి ట్రెండ్ అవుతుంది.

సోషల్‌మీడియాలో తాజాగా తన గ్లామర్ ఫోటోలు షేర్ చేసి నెట్టింట హీట్ పెంచుతుంది.

గతేడాది బ్రో సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ మరో తెలుగు సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.

2019లో విడుదలైన ‘ఓరు అదార్ లవ్’లో ఆమె హీరోని చూస్తూ కన్నుగీటిన సీన్ అప్పట్లో సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ అంటే ఈ బ్యూటీకి ప్రాణం. ఆయన నటించిన సినిమాలన్నీ చూసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

ఇంటర్ చదువుతున్నప్పుడే సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చేది. తల్లితండ్రుల కోరికమేరకు బీకామ్ వరకు చదువుకుంది.

తెలుగులో హీరోయిన్‌గా నితిన్ 'చెక్' సినిమాలో మెప్పించింది.

కేరళలోని త్రిశూర్‌కు చెందిన ప్రియ కుటుంబానికి సినిమా నేపథ్యం లేదు. తన తండ్రి సెంట్రల్ జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా ఉన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 8మిలియన్ల ఫాలోవర్స్ ప్రియా ప్రకాశ్‌కు ఉన్నారు.





