
శ్రీదేవి ఆకస్మిక మృతి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతపరిచింది. ఆమె మృతి పట్ల ఎంతోమంది ఆవేదనను విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. దివ్యమైన సౌందర్యం, అద్భుతమైన నటనాకౌశలంతో సినీ పరిశ్రమలో తిరుగులేని స్థానాన్ని సొంతం చేసుకున్న ఆమె కృషిని గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా ఓవర్‌నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియాప్రకాశ్ వారీయర్ శ్రీదేవికి నివాళులర్పించింది.
శ్రీదేవికి నివాళులర్పిస్తూ.. ‘కభీ అల్విదా నా కహెనా’ (ఎప్పుడూ వీడ్కోలు చెప్పొద్దు) పాటను విషాదంగా ఆలపించింది. ‘చరిత్ర ఎప్పుడూ గుడ్‌బై చెప్పద్దు. చరిత్ర కేవలం తర్వాత కలుద్దామని అంటుంది’ అని పేర్కొంటూ ఆమె ఈ వీడియోను ట్వీట్ చేశారు. ప్రియా కూడా శ్రీదేవి అభిమాని.. ఆమె మృతి వార్త తెలిసి తాను షాక్‌కు గురైనట్టు ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. ‘నా ఆల్‌టైమ్ ఫెవరేట్ శ్రీదేవి ఇకలేరని తెలియడం గుండెపగిలే వార్త. షాక్‌కు గురయ్యాను. ఆమె ఎల్లప్పుడూ మన గుండెల్లో బతికే ఉంటారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబానికి మనోధైర్యం కలుగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను’ అని ప్రియా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment