
న్యూఢిల్లీ : ప్రఖ్యాత నటి, అతిలోక సుందరి శ్రీదేవి అకాల మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతపరిచింది. ఆమె కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. మేనల్లుడు మోహిత్ మర్వా వివాహ వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వచ్చిన శ్రీదేవి.. వేడుకలు కొనసాగుతున్న తరుణంలోనే ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతిపై కుటుంబసభ్యులతోపాటు ఎంతోమంది సినీ ప్రముఖులు సంతాపం, బాధను వ్యక్తం చేశారు. తాజాగా శ్రీదేవి మేనల్లుడు మోహిత్ మర్వా స్పందించాడు. తన పెళ్లికి హాజరైన ఆమె అర్ధంతరంగా తనువు చాలించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘శ్రీదేవి లెజెండ్ కన్నా ఎక్కువే. ఆమె లేని లోటు ఎప్పటికీ మిగిలిపోతుంది’ అంటూ మోహిత్ ఆవేదనగా పోస్టు పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment