Priya Prakash Varrier Interesting Comments On Dhanush, Says He Is Her Celebrity Crush - Sakshi
Sakshi News home page

Priya Prakash Varrier: ఆయనంటే క్రష్‌.. అదోరకం పిచ్చి 

Oct 15 2022 5:15 AM | Updated on Oct 15 2022 10:00 AM

Priya Prakash Varrier calls Dhanush her celebrity crush - Sakshi

స్టార్‌ హీరోల దృష్టిలో పడటానికి ఈ తరం హీరోయిన్లు చాలా ట్రిక్స్‌ ప్రయోగిస్తున్నారని చెప్పవచ్చు. అవకాశాల కోసం కొందరు గ్లామర్‌ వాడుకుంటుంటే మరికొందరు హీరోలపై పొగడ్తలను మార్గంగా ఎంచుకుంటున్నారు. నటి ప్రియా ప్రకాష్‌ వారియర్‌ గుర్తుందా? ఒరు ఆధార్‌ లవ్‌ అనే చిత్రంతో బాగా పాపులర్‌ అయ్యింది ఈ మల యాళీ కుట్టి. 2018లో తనహ అనే చిత్రంతో నాయకిగా పరిచయమైన ప్రి యా ప్రకాష్‌ వారియర్‌ ఇప్పుడు బాలీవుడ్‌ స్థాయికి ఎదిగిపోయింది. మధ్య లో చెక్‌ అనే చిత్రంతో టాలీవుడ్‌ను టచ్‌ చేసింది.

విష్ణుప్రియ చిత్రం ద్వారా శాండిల్‌ వుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. దీంతో దక్షిణాదిలో ఈమె ఎంట్రీ ఇవ్వని సినీ పరిశ్రమ కోలీవుడ్‌ మాత్రమే. అందుకని ఈమె కన్ను ఇప్పుడు కోలీవుడ్‌పై పడినట్లు ఉంది. ఇక్కడ అవకాశాల వేట మొదలెట్టింది. అందుకు నటుడు ధనుష్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ధనుష్‌కు సంబంధించిన విషయాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ కోలీవుడ్‌ను అటెన్షన్‌ చేస్తోంది. ఇటీవల జరిగిన ఫిలింపేర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఈ బ్యూటీ అక్కడ సెంటర్‌ అట్రాక్షన్‌గా మారింది.

నటుడు ధనుష్‌ గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తున్న విషయాల గురించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు తనకు ధనుష్‌ అంటే క్రష్‌ అని, అదో రకం పిచ్చి అని పేర్కొంది. ఆయన సరసన నటించాలని చాలాకాలంగా కోరుకుంటున్నానని, అలాంటి అవకా శం త్వరలోనే వస్తుందని భావిస్తున్నట్లు చెప్పింది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు లో ఒక చిత్రం, మలయాళంలో రెండు చిత్రాలు, హిందీలో మూడు చిత్రాలు చేస్తూ బిజీగానే ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement