ప్రియా వారియర్‌ను టార్గెట్‌ చేసిందెవరు...? | Priya Varrier Video Inspires Neha Kakkar | Sakshi
Sakshi News home page

ప్రియా వారియర్‌ను టార్గెట్‌ చేసిందెవరు...?

Published Mon, Mar 12 2018 2:54 PM | Last Updated on Mon, Mar 12 2018 9:47 PM

Priya Varrier Video Inspires Neha Kakkar - Sakshi

న్యూ ఢిల్లీ : ఒక్క కనుసైగతో ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కుర్రాళ్లంత ఆ కనుసైగకు ఫిదా అయిపోయారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలను కూడా ఆ వీడియో విపరీతంగా ఆకర్షించింది. చాలామంది అమ్మాయిలు ప్రియా ప్రకాశ్‌ను అనుకరిస్తూ వీడియోలు తీసి సోషలోమీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. ఈ జాబితాలో ఇప్పుడు గాయకురాలు నేహ కక్కర్‌ చేరారు.

‘ఒరు ఆదర్‌ లవ్‌’ సిన్మా టీజర్‌లోని ఫ్లైయింగ్‌ కిస్‌ సన్నివేశాన్ని నేహ కక్కర్‌ తానే  నటిస్తూ వీడియో తీశారు. ‘ప్రియా వారియర్‌ నన్ను ప్రేరేపించింది. ‘గన్‌ ఉల్టి హో గయి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియోకు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొందరు చాలా బాగుందని చెప్పగా కొందరు గన్‌లోడింగ్‌ సరిగ్గా చేయలేదని చెప్పారు. ఈ విషయాన్ని నేహ ముందుగానే గుర్తించారు. అదే విషయాన్ని క్యాప్షన్‌గా పెట్టారు. పోస్టు చేసిన ఒక్క రోజులోనే ఈ వీడియోకు లక్షకు పైగా లైక్స్‌ వచ్చాయి.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పోస్టు చేసిన  ‘ఒరు ఆదర్‌ లవ్‌’ వీడియోకు ఒక్క రోజులోనే 4లక్షల వ్యూస్‌ వచ్చాయి. దీంతో ఒక్కరోజులోనే  ప్రియా వారియర్‌ పేరు దేశం అంతా మార్మోగిపోయింది. ప్రస్తుతం ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 51లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం ప్రియా వారియర్‌ ఒక్కో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు ఖరీదు రూ.8 లక్షలయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement