ఊహకందని... ఊహించలేని ఇన్వెస్టిగేషన్‌ ఇది | Malayalam Movie Rekhachithram OTT Review in Telugu | Sakshi
Sakshi News home page

ఊహకందని... ఊహించలేని ఇన్వెస్టిగేషన్‌ ఇది

Published Sat, Mar 15 2025 12:21 AM | Last Updated on Sat, Mar 15 2025 12:21 AM

Malayalam Movie Rekhachithram OTT Review in Telugu

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘రేఖా చిత్రం’(Rekhachithram) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

ఇదో ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌. ఈ తరహా సినిమాలు ఇప్పటికే మనకు పరిచయమున్నా క్షణం కూడా మీ చూపును మరల్చకుండా చేస్తుంది ఈ సినిమా స్క్రీన్‌ప్లే. ‘రేఖా చిత్రం’ ఓ మలయాళ సినిమా. సోనీలివ్, ఆహాలో తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ కూడా ఉంది. ఈ  సినిమాకి దర్శకుడు జోఫిన్‌ టి చాకో. కథ రాము సునీల్‌ అందించారు.

ప్రముఖ నటులు ఆసిఫ్‌ అలీ, అనస్వరా రాజన్‌ ప్రధాన తారాగణంగా నటించారు. సినిమా చూసే ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠతతో, ఊహకందని ట్విస్టులతో ఉర్రూతలూగిస్తుంది. అంతలా ఈ సినిమాలో ఏముందో కథలోకి వెళ్లి తెలుసుకుందాం. వివేక్‌ అనే పొలీస్‌ ఆఫీసర్‌కి మలక్కపరా అనే ప్రాంతంలో కొత్తగా పొస్టింగ్‌ వస్తుంది. అప్పటిదాకా అది క్రైమ్‌ ఫ్రీ ఫారెస్ట్‌ ప్రాంతం. కానీ వివేక్‌ ఛార్జ్‌ తీసుకున్న వెంటనే ఓ ఆత్మహత్య జరుగుతుంది. ఆత్మహత్య చేసుకున్నది రాజేంద్రన్‌ అనే బిజినెస్‌మేన్‌.

అది కూడా ఓ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. సెల్ఫీ వీడియోలో తాను కూర్చుని ఉన్న ప్రదేశంలో కొన్నేళ్ల క్రితం ఓ శవాన్ని మరో కొంతమందితో కలిసి పాతి పెట్టానని, ఆ బాధ తనను వేధిస్తుందని ఆత్మహత్య చేసుకుంటాడు. వివేక్‌ వెంటనే ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెట్టి ఆ ప్రాంతంలో తవ్వగా ఓ అస్థిపంజరం బయటపడుతుంది.

అది ఓ అమ్మాయిదని ఫోరెన్సిక్‌ నివేదికలో తేలుతుంది.  ఇప్పుడు వివేక్‌ చేతిలో రాజేంద్రన్‌ సెల్ఫీ వీడియో తప్ప ఈ అస్థిపంజరానికి సంబంధించిన ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. మరి... వివేక్‌ ఈ కేసు ఎలా పరిష్కరించాడో సినిమాలోనే చూడాలి. పైన చెప్పుకున్నట్టు సినిమా మొత్తం ఊహించని ట్విస్టులతో క్లైమాక్సులో ఊహకందని మలుపుతో మతి పొగొడుతుంది. పెద్దవాళ్లు మాత్రమే చూడదగ్గ ఈ సినిమా వీకెండ్‌కు మంచి కాలక్షేపం. వర్త్‌ఫుల్‌ వాచ్‌ ఫర్‌ థ్రిల్లింగ్‌. – ఇంటూరు హరికృష్ణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement