అర్ధరాత్రి భర్త చేసిన పనికి బుల్లితెర నటి ఎమోషనల్..! | Ravinder Chandrasekar Gives Surprise To His Wife Mahalakshmi | Sakshi
Sakshi News home page

మీరు భర్తగా ఉండటం నా అదృష్టం: బుల్లితెర నటి ఎమోషనల్!

Mar 21 2024 6:09 PM | Updated on Mar 21 2024 6:46 PM

Ravinder Chandrasekar Gives Surprise To His Wife Mahalakshmi - Sakshi

కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంటారు. గతేడాది నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తరచుగా వార్తల్లొ నిలిచారు. వీరిద్దరి పెళ్లి తర్వాత ఓ కేసులో అరెస్ట్ అయిన రవీందర్‌ ఇటీవలే బెయిల్‌పై రిలీజై వచ్చారు కూడా. ఆ తర్వాత తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌పై రివ్యూలు ఇస‍్తూ అభిమానులను అలరించారు. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇవాళ రవీందర్ భార్య మహాలక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. అర్ధరాత్రి కేక్ తీసుకొచ్చి భార్య బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మహాలక్ష్మి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అంతే ఎమోషనల్ నోట్‌ రాసుకొచ్చింది. 

మహాలక్ష్మి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ పుట్టినరోజు తీవ్ర భావోద్వేగాలతో నిండిపోయింది. నా భర్త అర్ధరాత్రి నన్ను నిద్రలేపి కేక్‌తో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. అతన్ని భర్తగా కలిగి ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. మా అమ్మ, సోదరుడు నన్ను మానసిక వికలాంగుల కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పిల్లలకు అన్న దానం చేశాం. ఇది నా గుండెకు హత్తుకునే అనుభవం. ముఖ్యంగా మా అమ్మ, చిన్న సోదరుడు చోటేకి ధన్యవాదాలు. మా నాన్న బంగ్లాదేశ్ నుంచి విష్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. అన్ని సమయాల్లో  అండగా నిలిచిన మామయ్యకు ధన్యవాదాలు. ఈ రోజు నా జీవితంలో ఎల్లప్పుడూ ప్రత్యేకమైంది. మీ అందరు నా చుట్టూ ఉన్నందుకు  సంతోషంగా ఉన్నా. ఈ రోజున శుభాకాంక్షలు తెలిపేందుకు సమయాన్ని వెచ్చించినందుకు నా కుటుంబం, స్నేహితులందరికీ, నన్ను ప్రేమించే వారికి కృతజ్ఞతలు' అంటూ మహాలక్ష్మి పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మహాలక్ష్మికి బర్త్‌ డే విషెస్ చెబుతున్నారు. 

అయితే తన పుట్టినరోజు సందర్భంగా నటి మహాలక్ష్మి కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవదానానికి ఆమె ముందుకొచ్చారు. నేను చనిపోయాక కూడా నా ఆర్గాన్ ఇతరుల రూపంలో బతికే ఉంటాయని ఆమె తెలిపారు. నేను ఒక అవయవ దాతగా మారి ఇతరుల జీవితాల్లో వెలుగులు తీసుకురాగలననే నమ్మకంతో ప్రేరణ పొందినట్లు వెల్లడించారు. నా నిర్ణయంతో అవసరమైన వారికి  మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement