మరోసారి తెరపైకి నిర్మాత రవీందర్.. ఈసారి ఏకంగా ఆక్సిజన్‌తో! | Kollywood Producer Ravinder Chandrasekar Health Condition Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Ravinder Chandrasekar: ఆక్సిజన్ ట్యూబ్‌తో రవీందర్‌.. ఇంతకీ ఏం జరిగిందంటే?

Published Thu, Jan 11 2024 4:42 PM | Last Updated on Thu, Jan 11 2024 5:25 PM

Kollywood Producer Ravinder Chandrasekar Health Condition Video Goes Viral - Sakshi

కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో కనిపిస్తుంటారు. గతేడాది నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తరచుగా వార్తల్లొ నిలిచారు.  పెళ్లి తర్వాత ఓ కేసులో అరెస్ట్ అయిన రవీందర్‌ ఇటీవలే బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. 

అయితే ప్రస్తుతం జైలు నుంచి విడుదలైన రవీందర్‌ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నారు. తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌పై రివ్యూలు ఇస‍్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన యూట్యూబ్‌లో వీడియో చూస్తే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాజా వీడియోలో ఏకంగా ఆక్సిజన్ ట్యూబ్ పెట్టుకుని మరీ కనిపించారు. అంతే కాకుండా అనారోగ్యంతోనే బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌పై తన రివ్యూ ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ మీ పట్టుదల సూపర్ సార్ అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సార్.. బిగ్‌బాస్ రివ్యూలు ఎప్పుడైన ఇవ్వొచ్చు అంటూ సలహాలు ఇస్తున్నారు. 

అయితే మొహానికి ఆక్సిజన్‌ మాస్క్ పెట్టుకోవడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని వెల్లడించారు.  వారం రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకున్నట్లు రవీందర్‌ పేర్కొన్నారు.  ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్స్ ఆరోగ్యం సహకరించనప్పుడు వీడియోలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా.. లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన పలు సినిమాలు నిర్మించిన రవీందర్‌ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత  బుల్లితెర నటి మహాలక్ష్మితో అతని వివాహం జరిగింది. దీంతో మీడియా, అభిమానుల దృష్టిని వారు ఆకర్షించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement