కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ఇంట్లీ ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. సుమారు రెండేళ్ల క్రితం నటి మహాలక్ష్మి శంకర్‌తో వివాహం అయిన తర్వాత ఆయన పేరు బాగా పాపులర్ అయింది. అయితే, కొంత కాలం క్రితం రూ. 16 కోట్ల వరకు ఒక వ్యాపారవేత్తను మోసం చేసినందుకు గాను ఆయన్ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) వారు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆపై ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
లిబ్రా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ అధినేత అయిన రవీందర్ చంద్రశేఖరన్ ఇంట్లో తాజాగా ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రస్తుతం రవీందర్ చంద్రశేఖర్ చెన్నైలోని అశోక్ నగర్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రవీందర్ ఇంట్లో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. అక్రమ నగదు బదిలీపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
మునిసిపల్ సాలిడ్ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టేందుకు బాలాజీ అనే వ్యక్తితో రూ. 16 కోట్లు ఇన్వెస్ట్ చేపించిన రవీందర్ ఆపై అతన్ని మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ కేసులు జైలుకు వెళ్లిన ఆయన ప్రస్తుతం బెయిల్ మీదు ఉన్నారు. తాజాగా రూ. 16 కోట్ల మోసం కేసులో అక్రమ నగదు మార్పిడికి సంబంధించిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాల తర్వాత ఏవైనా ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారా? అనేది తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment